నామినేష‌న్ దాఖ‌లు చేసిన పెనుమ‌త్స సురేష్‌బాబు

స‌చివాల‌యం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమ‌త్స సురేష్‌బాబు నామినేషన్‌ దాఖలు చేశారు. మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ రాజీనామాతో ఖాళీ అయిన‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి సురేష్‌బాబు నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, నామినేషన్‌ దాఖలుకు నేడు ఆఖ‌రు కాగా, ఈ నెల 24న ఎన్నిక నిర్వ‌హించి అదేరోజు ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్‌బాబు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top