2022 జ‌న‌వ‌రి నుంచి పెన్ష‌న్ రూ.2500

కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్ జగన్‌ సర్కార్‌ కానుక

తాడేప‌ల్లి: కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌ సర్కార్‌ కానుక. 2022 జ‌న‌వ‌రి నుంచి వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక రూ.2500 అందించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. వైయ‌స్ఆర్ పెన్షన్ కానుక‌ రూ.2250 నుంచి రూ.2500కు పెంచ‌నున్నారు. పెరిగిన పెన్ష‌న్ రూ.2500 జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ పెట్ట‌నుంది. కలెక్టర్లు, ఎస్పీల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

డిసెంబ‌ర్, 2022 జ‌న‌వ‌రిలో అమ‌లు చేయ‌నున్న కార్య‌క్ర‌మాల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ వెల్ల‌డించారు.  
- డిసెంబర్‌ 21న సంపూర్ణ గృహహక్కు పథకం.
- డిసెంబర్‌ 28న ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పొరపాటున మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ.
- జనవరి 1, 2022న పెన్షన్‌కానుక కింద పెన్షన్లు రూ.2,500కు పెంపు 
- జనరరి 9న ఈబీసీ నేస్తం అమలు. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు.
- జనవరిలోనే రైతు భరోసా. తేదీ త్వరలోనే ప్రకటిస్తారు.

Back to Top