ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే నారాయ‌ణ‌రెడ్డిని హ‌త్య చేశారు

పత్తికొండకు రెవెన్యూ డివిజన్‌, పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేసిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదే

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

పత్తికొండటౌన్‌: టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని, బీసీ నాయకుడు బోయ సాంబశివుడును దారుణంగా హత్య చేయించారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. కుట్రదారులు, కబ్జాకోరులను తన పక్కనే పెట్టుకుని నారా లోకేశ్‌ నీతి వ్యాఖ్యలు వల్లె వేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్న నారా లోకేశ్‌ను చూసి ప్రజలు జోకర్‌ లోకేశ్‌ అని నవ్వుకుంటున్నారని  అన్నారు. పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న లోకేశ్‌ పెద్ద మూర్ఖుడు అన్నారు. మహిళలను గౌరవించలేని సంస్కారం ఆయనది అన్నారు.

చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేశారని, అయితే కుప్పంలో ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వచ్చి పత్తికొండకు పరిశ్రమలు తెస్తాం అంటూ లోకేశ్‌ ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. పత్తికొండ నుంచి ఎన్నికై న కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ మంత్రిగా పనిచేసి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పత్తికొండకు రెవెన్యూ డివిజన్‌, పోలీసు సబ్‌డివిజన్‌ ఏర్పాటుచేసిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు. నియోజకవర్గంలోని చెరువులకు నీటిని మళ్లించే పనులకు సంబంధించి టీడీపీ హయాంలో భూముల సేకరణ మాత్రమే జరిగిందన్నారు. వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 65 శాతం పనులు జరిగాయన్నారు. త్వరలోనే చెరువులకు నీళ్లు వస్తాయన్నారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు టీడీపీ నాయకులకు మాత్రమే సాధ్యం అన్నారు.

టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని, బీసీ నాయకుడు బోయ సాంబశివుడును దారుణంగా హత్య చేయించారన్నారు. కుట్రదారులు, కబ్జాకోరులను తన పక్కనే పెట్టుకుని నారా లోకేశ్‌ నీతి వ్యాఖ్యలు వల్లె వేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పర్సంటేజీల కోసం రైల్వే కాంట్రాక్టర్‌పై టీడీపీ బీసీ నాయకుడు తుగ్గలి నాగేంద్ర అనుచరులు దాడులు చేసిన చరిత్ర మరిచారా అని ఎమ్మెల్యే నిలదీశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కేఈ అనుచరులు మోసం చేసిన ఘటనలు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు.  సమావేశంలో పత్తికొండ ఎంపీపీ నారాయణదాసు, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి శ్రీరంగడు, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌, వక్ఫ్‌బోర్డు జిల్లా డైరెక్టర్‌ టీఎండీ హుసేన్‌, హోసూరు, కోతిరాళ్ల సర్పంచులు నాగప్ప, అంజినయ్య పాల్గొన్నారు.

Back to Top