కడప నూతన మేయర్ గా పాకా సురేష్ 

అభినంద‌న‌లు తెలిపిన వైయస్ఆర్‌సీపీ నేత‌లు

వైయ‌స్ఆర్ జిల్లా: కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కడప నూతన మేయర్‌గా ఎంపికైన సందర్భంగా పాక సురేష్ కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి  , మాజీ డిప్యూటీ సీఎం ఎస్ బి అంజాద్ బాషా , అన్నమయ్య జిల్లా పరిశీలకులు కే సురేష్ బాబు,ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి , డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి , ఎస్ఈసీ సభ్యులు మాసిమా బాబు, యానాదయ్య,సీనియర్ నాయకులు సుభాన్బాష, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు సురేష్‌ను అభినందించారు. 

Back to Top