తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డాక్టర్ కుంభా రవిబాబు కలిశారు. గవర్నర్ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులుగా నియమితులైన పద్మశ్రీ, రవిబాబు శుక్రవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరిని సీఎం వైయస్ జగన్ అభినందించారు.