వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ నెల్లూరు మేయర్ దంపతులు  

మ‌నస్పూర్తిగా వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నాం: ఎంపి ఆదాల

నెల్లూరు:  కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిన్నపాటి పొరపాటున పార్టీకి దూరమై, తాను చేసిన తప్పును తెలుసుకొని పార్టీలో తమతో కలిసి పనిచేసెందుకు నిర్ణయం తీసుకొని వైయ‌స్ఆర్‌సీపీలోకి వచ్చిన నెల్లూరు నగర మేయర్  పొట్లూరి స్రవంతి జయవర్ధన్ దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి  ఆహ్వానిస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్ ఆనం అరుణమ్మ, డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, మెట్టుకూరు ధనంజయరెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిల సమక్షంలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ దంపతులు  తమ సొంత పార్టీ అయినా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  చేరారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో  నెల్లూరు ఎంపీ, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చేసిన చిన్నపాటి పొరపాటున నగర మేయర్ పొట్లూరి  స్రవంతిజయవర్ధన్  దంపతులు సరిదిద్దుకొని తిరిగి పార్టీలకి రావడం సంతోషంగా ఉందన్నారు. వారిని మనస్పూర్తిగా వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. అంతకు ముందు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి అక్కడే నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ లను వైయ‌స్ఆర్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు.  పార్టీలో తిరిగి చేరిన మేయర్ స్రవంతి నెల్లూరు సిటీ, రూరల్  నియోజకవర్గాల్లోని పార్టీ కార్పొరేటర్ల అందరితోనూ సమన్వయంగా పనిచేయాలన్నారు. అందర్నీ కలుపుకొని ఐకమత్యంగా 2024లో రూరల్, సిటీ నియోజకవర్గాల్లో  వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపున‌కు కృషి చేయాలని కోరారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు సంపూర్ణ సహకారం అందించి, సిటీ కార్పొరేటర్లను సమన్వయంతో కలుపుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు.

Back to Top