దత్తపుత్రుడిది బాబు భరోసా యాత్ర! 

 ప్యాకేజీ స్టార్‌ది పొత్తుకు తహతహ 

 ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

నంద్యాల‌: ద‌త్త‌పుత్రుడిది చంద్ర‌బాబు భ‌రోసా యాత్ర అని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌విచంద్ర‌కిశోర్‌రెడ్డి ఎద్దేశా చేశారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నది ఈ రోజు పవన్‌ కల్యాణ్‌ ‘కౌలు రైతు భరోసా యాత్ర’లో ఇచ్చిన సందేశం. ఈ మాటలు విన్న తరవాత... పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నది కేవలం చంద్రబాబు భరోసా యాత్ర అని అందరికీ మరింత స్పష్టంగా అర్థమయింది. 

– రైతుల పేరిట తాను చేస్తున్నది కేవలం రాజకీయమేనని చంద్రబాబు కోసమే తాను ఈ పని చేస్తున్నానని ప్యాకేజీ స్టార్‌ స్పష్టంగా చెప్పేశాడు.

– ఈ దత్తపుత్రుడి స్క్రిప్ట్‌ టీడీపీ కార్యాలయంలో తయారవుతుంటే...  స్క్రీన్‌ప్లే, కథ, దర్శకత్వం ప్రకారం... చంద్రబాబు ఆనే నిర్మాతకు అనుకూలంగా నటించటాన్ని పవన్‌ కల్యాణ్‌ రాజకీయం అని పేరు పెట్టుకున్నాడు.  

– పవన్‌ కల్యాణ్‌ ఒక పార్టీ ఎందుకు పెట్టాడంటే... చంద్రబాబు అధికారంలో ఉంటే... యాంటి ఇన్‌కంబెన్సీ ఓటును, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి; చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేయాలని మిగతా పార్టీలను కూడా రెడీ చేయటానికి. ఈ ప్యాకేజీ స్టార్‌ను దత్త పుత్రుడని కాక ఏమంటారు? 

– సొంత పుత్రుడు లోకేశ్‌ మీద నమ్మకంలేక, ఒంటరిగా గెలుస్తామన్న నమ్మకం ఏ కోశానా లేక, ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేక... మళ్ళీ దత్త పుత్రుడిని రా రమ్మంటున్న చంద్రబాబును ఏమంటారు? 44 సంవత్సరాల అనుభవజ్ఞుడు... 14 సంవత్సరాల సీఎం అంటారా? చేతగాని రాజకీయ నాయకుడంటారా? 

– తాను పవన్‌కల్యాణ్‌తో పొత్తులో ఉన్నానని బీజేపీ అనుకుంటోంది. తాను తెలుగుదేశంతో మళ్ళీ ఎలా కలిసిపోవాలా అని పవన్‌ కల్యాణ్‌ అనుకుంటున్నాడు. ఇదీ ఈ క్యారెక్టర్‌ లేని ఆర్టిస్టుగారి పరిస్థితి! అప్పుడే బీజేపీని వదిలేయటానికి రెడీ అయ్యాడు! రియల్‌ లైఫ్‌లో అయినా, పొలిటికల్‌ లైఫ్‌లో అయినా ఒకే పద్ధతి! ఇతని కంటే ఘనుడు, వెన్నుపోటు, వంచనల నిపుణుడు– చంద్రబాబు. 

– పవన్‌ కల్యాణ్‌ను నేరుగా అడుగుతున్నాం... 2014లో రైతులకు మీ మూడు పార్టీలూ ఇచ్చిన వాగ్దానం ఏమిటి? దాన్ని నమ్మి రైతు నష్టపోయి... బ్యాంకులకు, వడ్డీ వ్యాపారులకు చెల్లించుకున్న మూల్యంలో మీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ తరవాత ఆత్మహత్యలంటూ జరిగితే మీ మోసమే అందుకు కారణం కాదా? 

– జగనన్న ప్రభుత్వం రైతులకు ఈ 35 నెలల పాలనలో అందించిన సహాయం గురించిన కొన్ని వివరాలను ఈ రాష్ట్ర ప్రజలముందు ఉంచుతున్నాం. 

– వైయస్సార్‌ రైతు భరోసాగా రూ. 20,162 కోట్లు; రైతులకు సున్నా వడ్డీ రుణాలకు రూ. 1219 కోట్లు; ఉచిత పంటల బీమాకు రూ. 3,788 కోట్లు, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ. 1542 కోట్లు రైతుల చేతికి అందించిన ప్రభుత్వం... జగన్‌గారి ప్రభుత్వం. ఈ స్థాయిలో సహాయం అందించటం గతంలో ఏనాడూ ఏ ప్రభుత్వం లోనూ లేదు.

– అంతే కాకుండా, విత్తనం నుంచి అమ్మకం వరకు అడుగడుగునా రైతుకు అండదండలు అందించే రైతు భరోసా కేంద్రాలను దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద... రైతులకు ద్రోహం చేసిన ప్రభుత్వంలో పార్ట్‌నర్‌ మొసలి కన్నీరు కార్చటం ఏమిటి? రైతులకు, డ్వాక్రా మహిళలకు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి జాయింటుగా 2014–19 మధ్య ద్రోహం చేసి... అధికారంలోకి రాగానే, ఎన్నికల వాగ్దానాలన్నింటినీ గాలికి వదిలేసి, రైతుల జీవితాలతో ఆడుకుని వారి ఆత్మహత్యలకు కారకులైన బాబు–పవన్‌... ఇప్పుడు మళ్ళీ కలిసి పోవటానికి సాకులు వెతుక్కుంటున్నారు. అందులో భాగమే రైతుల పేరిట చంద్రబాబు తాను ఆడితే బాగోదని పవన్‌తో ఆడిస్తున్న ఈ డ్రామా. 

– చంద్రబాబు హయాంలో మరణించిన 450 మందికి పైగా రైతులకు కూడా పరిహారం జగన్‌గారి ప్రభుత్వమే పరిహారం ఇచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ఈ రోజున వెళుతున్న ప్రతి రైతు, గుర్తింపు పొందిన కౌలు రైతు ఇంటికీ పరిహారం ఇంతకు ముందే అందింది. ఆత్మహత్య చేసుకున్నవారికి పారదర్శక ప్రక్రియద్వారా ప్రతి కుటుంబానికీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి, పోలీస్‌ రిపోర్టుల ఆధారంగా పరిహారాన్ని అందజేయటం జరిగింది. ఈ విషయాన్ని ఒప్పుకునే మనసు, ధైర్యం పవన్‌ కల్యాణ్‌కు లేదు. 

– అలాగే, దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కౌలు రైతుకు 11 నెలల పాటు పంటమీద హక్కు మాత్రమే ఉంటుందని; అటు కౌలు రైతుకు– ఇటు భూస్వామికి కూడా ఉభయతారకంగా ఉండేలా ఒక ఎగ్రిమెంట్‌ పత్రాన్ని చట్టబద్ధంగా రూపొందించి... వారి ఎగ్రిమెంట్‌ ఆధారంగా లక్షల మందిని కౌలు రైతులుగా గుర్తించిన మొట్టమొదటి ప్రభుత్వం జగనన్నది. 

– ఇలా ఎగ్రిమెంట్‌ ఉన్న కౌలు రైతుల కుటుంబాలన్నింటికీ, ఆత్మ హత్యకు పరిహారంగా రూ. 7 లక్షలు ఇస్తాం అని మనందరి ప్రభుత్వం ప్రకటించటమే కాకుండా ఇస్తోంది.

– పవన్‌ కల్యాణ్‌ దివాలా కోరు వ్యవహారం ఏమిటంటే... రైతులకు, సీసీఆర్‌సీ ఉన్న కౌలు రైతులకు... వారు ఆత్మహత్యలు చేసుకుంటే ఇస్తున్న రూ. 7 లక్షలు కుటుంబాలకు ఇవ్వలేదని చెప్పే ధైర్యం లేదు. ఆ కుటుంబాల దగ్గరకు వెళ్ళినప్పుడు అమ్మా... మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందిందా అని అడిగే మనసు కూడా లేదు.

– అటు రైతుగా, ఇటు సీసీఆర్‌సీ ప్రకారం కౌలు రైతుగా... ఈ రెండింటిలో ఏ ఒక్కటీ కాకుండా ఉండిపోయినా... అలాంటి వారికి కూడా  రూ.1 లక్ష 18–65 మధ్య వయసున్నవారికి వైయస్సార్‌ బీమాగా మన ప్రభుత్వం వెంటనే అందజేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే, వీటన్నింటినీ దాచేసి... మరణించిన వారందరినీ  ఏదోరకంగా కౌలు రైతుల జాబితాలో వేసేయాలని ప్రయత్నించటం రైతుల మీద ప్రేమ అవుతుందా? 

–  నలుగురు పెళ్ళాల్ని కార్లు మార్చినట్టు మార్చి... అందులో మొదటి భార్య కాపు. ఆమెను వదిలేసి... రెండో భార్య ఇండియన్‌... ఆమెనూ వదిలేసి.... వారి పిల్లల్ని వదిలేసి... మూడో భార్య ఇంటర్నేషనల్‌... ఆ రష్యన్‌ భార్య కూడా ఇక్కడ లేదంటున్నారు... ఇంతటి దుర్మార్గంగా తన వ్యక్తిగత జీవితంలో స్త్రీలంటే వాడుకుని వదిలేసే వస్తువులుగా చూస్తున్న పవన్‌ కల్యాణ్‌  ఏ అక్క చెల్లెమ్మను ఓదార్చటానికి అర్హుడో అక్కచెల్లెమ్మలు కూడా అర్థం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే కోరారు.

Back to Top