చంద్రబాబు, టీడీపీ నేతలది రాక్షసానందం

అర్థం లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవపట్టించాలని కుట్ర

కుట్రలు, కుతంత్రాలు బాబుతోనే పుట్టాయి

పార్టీ హామీని ప్రభుత్వ హామీగా మాట్లాడడం సిగ్గుచేటు

దేవినేని ఉమా.. మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారా..?

కౌలురైతులకు సాయం అందించిన ఏకైక సీఎం.. వైయస్‌ జగన్‌

ఫెడరల్‌ స్ఫూర్తితో రైతుభరోసా పథకం

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

 

తాడేపల్లి: ప్రజలందరి బాగుకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో, తట్టుకోలేక ఉక్రోశంతో చంద్రబాబు అండ్‌ కో విమర్శలు చేసి రాక్షసానందం పొందుతున్నారని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. భూ యజమానికి యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా చట్టాన్ని మార్పు చేసి కౌలు రైతులకు కూడా పెట్టుబడిసాయం అందించిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇది తట్టుకోలేక ఎందుకు ఓడిపోయామో తెలియదని చెప్పుకునే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి రకరకాల విమర్శలు చేస్తున్నారన్నారు. ఇరిగేషన్‌ శాఖ అంటే ఏమిటో తెలియని వ్యక్తి దేవినేని ఉమ కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వ్యవసాయ శాఖకు ఇద్దరు మంత్రులను నియమించారని దేవినేని ఉమా మాట్లాడుతున్నాడని, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఉమా.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా అని నాగిరెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ, కోఆపరేటివ్‌ శాఖకు కురసాల కన్నబాబు మంత్రి అని, వ్యవసాయ అనుబంధ రంగాలు పశుసంవర్ధక శాఖ, మత్స శాఖకు మోపిదేవి వెంకట రమణ మంత్రిగా ఉన్నారని సూచించారు. వ్యవసాయ మిషన్‌లో తనకు కేబినెట్‌ ర్యాంకు ఇచ్చారని దేవినేని ఉమ తనను వ్యవసాయ శాఖ మంత్రి అనుకుంటున్నారా..? ఇంత అసంబద్ధమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిని చంద్రబాబు ఐదేళ్లు ఎలా కేబినెట్‌లో పెట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు.

తాడేపల్లి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతు విభాగం అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలుకు సమాధానం చెప్పాలనే మీడియా ముందుకు వచ్చాను. వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో ధర్మబద్ధమైన సమస్యలు ఏమైనా ఉంటే వారిని పరిష్కరిస్తాం. ఈ పథకానికి అర్హులు ఎక్కడైనా మిస్సై ఉంటే తెలియజెప్పాలని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రజలు, మీడియా మిత్రులను కోరారు. రైతు భరోసా పథకానికి గడువు ముగిసిపోలేదు. ఇంకా నెల రోజులు సమయం ఉంది. పారదర్శకంగా పథకం అమలుచేయాలని, అర్హులు ఎవరు మిగిలిపోవద్దని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన.

Read Also : వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి బాబు తట్టుకోలేకపోతున్నారు

వ్యవసాయ మిషన్‌ గొప్ప అడ్వయిజరీ బాడీ, వ్యవసాయానికి సంబంధించిన ఆరు శాఖలు, మంత్రులు ఐదుగురు, ఆరు శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, సీఎం చైర్మన్‌గా ఉండి సాగే మిషన్‌ ఇది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ రోజు అయినా గంట పాటు వ్యవసాయం, రైతు సమస్యలపై చర్చ చేశారా..? ప్రతి కేబినెట్‌ మీటింగ్‌లో అనుచరులకు భూములు కట్టబెట్టడమే తప్ప రైతుల గురించి ఆలోచించిన పాపానపోలేదు. జూన్‌ 8వ తేదీన కేబినెట్‌ ప్రమాణస్వీకారం.. అక్టోబర్‌ 14న మిషన్‌ నాల్గవ మీటింగ్‌ జరిగింది. నాలుగు మీటింగ్‌లు కూడా రైతుల గురించే చర్చించాం. రైతుల సమస్యల పరిష్కరించాలనే సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.

బేషరతుగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని 2012లో అనంతపురం పాదయాత్రలో చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి అదే మాట చెప్పారు. రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చంద్రబాబు చెబితే ఎలక్షన్‌ కమిషన్‌ కూడా నోటీసులు ఇచ్చింది. దానికి మా ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ కాదు.. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ అని పచ్చపార్టీ నేతలు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండదు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఉంటుంది.
అసంబద్ధమైన విధానాలతో రైతు రుణమాఫీని రూ.24 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఐదు విడతలు చేసి మొదటి విడత రూ.5200 కోట్లు చేశారు. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయని చంద్రబాబు ఇవాళ పార్టీ హామీని.. ప్రభుత్వ హామీ అని మాట్లాడడం సిగ్గుచేటు.
 
2020 మే నెలలో రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానని సీఎం వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో పెట్టారు. ఇచ్చిన హామీని సంవత్సరం ముందుగానే పథకాన్ని అమలు చేస్తూ రూ.5510 కోట్ల జీఓ విడుదల చేశారు. ఇదంతా ప్రజలకు కనిపిస్తుంది. నాలుగు నెలల్లోనే గ్రామ సచివాలయాలు, వాహనమిత్ర, రైతు భరోసా ఎట్లా సాధ్యమైందని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటూ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ డిసెంబర్‌ నెల నాటికి జీతాలు ఇవ్వలేరని, ప్రభుత్వం పడిపోతుందని రాక్షస ఆనందం పొందుతూ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఏపీని దివాళా తీయించారు.

ఫెడరల్‌ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ కేంద్ర నిధులను కూడా ఈ పథకంలో కలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో పెట్టుబడి సాయం ఇస్తామని ఎక్కడైనా చెప్పామా..? వ్యవసాయానికి సంబంధించిన మద్దతు ధరలు, ఎగుమతులు, దిగుమతులు, క్రాప్‌ ఇన్సూరెన్స్, వడ్డీలు ఏదైనా సరే అన్ని కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యం. వాస్తవాలకు దూరంగా మాట్లాడొద్దు చంద్రబాబూ.. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుతో పాటు పుట్టాయని నాగిరెడ్డి విమర్శించారు. 

Read Also : వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి బాబు తట్టుకోలేకపోతున్నారు

తాజా వీడియోలు

Back to Top