వైయ‌స్ఆర్ షాదీ తోఫాపై ముస్లింలు హర్షం

సీఎం వైయ‌స్ జగన్ చిత్రపటానికి మైనారిటీ నేతల క్షీరాభిషేకం..

ఉరవకొండ: వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పథకాన్ని అక్టోబర్ 1తేదీ నుంచి అమలు చేయనుండడంపై ఉరవకొండ ముస్లింలలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా వైయ‌స్ఆర్ సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సీఎం వైయ‌స్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఉర‌వ‌కొండ‌లోని ఎస్ఎల్ఎన్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి వడ్ల హాజీ షేక్షవలి, పామిడి జాకీర్, అసిఫ్, బెల్దర్ శర్మాస్, పిజిఎస్ మాబు, వడ్ల సలీం, జిఎంఎస్ షకీల్, అయ్యర్ దాదు, షాంశుద్దిన్, అహ్మద్, వలి, ముల్లాసాబ్, సాదిక్ వలి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన వైయ‌స్ఆర్ షాదీ తోఫా హామీని సీఎం వైయ‌స్ జగన్ అమలు చేయాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. పేదింటి ముస్లిం యువతులు తన చెల్లెళ్లుగా భావించి సాయం చేస్తున్న వైయ‌స్ జగన్ పదికాలాల పాటు వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.

ప‌త్తికొండ‌లో..
మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్ర‌కారం పేద ముస్లిం మైనారిటీ, ఎస్సీ, ఎస్టి, బీసీల కోసం క‌ల్యాణ‌మ‌స్తు, షాదీ తోఫా ప‌థ‌కాల అమ‌లు నిర్ణ‌యం తీసుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం నిర్వ‌హించారు. ప‌త్తికొండ‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి నెలలో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ జిల్లా, మండల నాయకులు, పత్తికొండ మండల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top