పక్కరాష్ట్రంలో ప్రవాసిలా చంద్ర‌బాబు గడుపుతున్నాడు  

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పెట్టుబ‌డుల పేరుతో ప్ర‌జాధ‌నాన్ని కొల్ల‌గొట్టార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. పవర్లో ఉన్నన్నాళ్లు పెట్టుబడులని, పర్యటనలు అని  ప్రత్యేక విమానాల్లో తిరగని దేశం లేదు. రాజకీయ ప్రత్యామ్నాయం తెస్తానని ఊరేగని రాష్ట్రం లేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్ము నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పక్కరాష్ట్రంలో ప్రవాసిలా గడుపుతున్నాడు చంద్రబాబు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

Back to Top