ఈ బానిసలకు మోదీ, షాల కంటే చంద్రబాబే ముఖ్యం 

ఎంపీ విజయసాయిరెడ్డి   

ఏపీలో బీజేపీ టీడీపీ ఫిరాయింపు నేతల పెత్తనం

అమరావతి:  ఏపీ బీజేపీ అధ్యక్షుడిని, కార్యదర్శులను పక్కకు నెట్టిన చంద్రబాబు కోవర్టులు ఇప్పుడు పార్టీపై కంట్రోల్ తీసేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుజనా చౌదరి నేతృత్వంలో మొన్న గవర్నర్ ను కలిసిన బృందాన్ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. ఈ బానిసలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ, చంద్రబాబు, సుజనాచౌదరిలను ట్యాగ్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top