రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర... రాక్షస పాలన

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:   ఏపీలో కూటమి సర్కార్‌ పాలనపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్‌ చేశారు.  రాష్ట్రంలో చంద్ర‌బాబు విధ్వంస‌క‌ర‌..రాక్ష‌స పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

జగన్ గారు గత ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టారు. ముఖ్యంగా నాడు రాష్ట్రాన్ని 'హరిత ఆంధ్రప్రదేశ్'గా.. 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా... 'విద్యా ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దితే.. నేడు ఈ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా.. మద్యాంధ్రప్రదేశ్‌గా.. అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కూట‌మి పాల‌న‌ను ఎండ‌గ‌ట్టారు.

Back to Top