నక్కజిత్తుల నారా భయపడాల్సిన అవసరం ఏముంది?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  హైద‌రాబాద్‌లో ఓటుకు నోటు కేసులో ఆధారాల‌తో ప‌ట్టుబ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అర్ధ‌రాత్రి ప‌రారైన చంద్ర‌బాబును వెనుకేసుకొస్తూ ఓ వ‌ర్గం మీడియా రాసిన క‌థ‌నంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కేసిఆర్ పైఎత్తుకు చిత్తై నారా బాబు పిరికితనంతో లొంగిపోయాడని, పలాయనం చిత్తగించాడని "పెద్దబాకారాయుడు" alias  కులరాజగురు రాము తన సొంత పేపర్‌లోనే “కీర్తించారు”. తప్పు చేయకపోతే నక్కజిత్తుల నారా భయపడాల్సిన అవసరం ఏముంది? చాలా విడమరచి చెప్పినట్లే!! అంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

  ఫోన్ సంభాషణల్లో చంద్రం అడ్డంగా  పట్టుబడ్డా, ప్రత్యక్ష ఆధారాలు లేవంటూ “కొత్త పలుకు”లో సరికొత్త సమర్ధింపులు! ఇంత జరిగినా అప్పుడప్పుడు పుట్టల్లో నుంచి, కలుగుల్లో నుంచి తలలు బయటపెట్టి విషనాలుకలు చాచే ప్రయత్నం మాత్రం ఇంకా మానుకోవడం లేదు తెలంగాణలో! జాతి లక్షణం…ఏం చేద్దాం? అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top