ఆ విషయంలో చంద్రబాబు దిట్ట

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 
 

 అమరావతి : నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని ట్విటర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదని తెలిపారు. ‘మోపిదేవి, బోస్‌ల పార్టీ విధేయతను గుర్తించి.. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే చంద్రబాబుకు, వైయస్‌ జగన్‌కు ఉన్న తేడా’ అని ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్ట్‌ చేశారు.
 

Back to Top