తండ్రి జూమ్ లో, కొడుకు ట్విట్టర్లో వీరంగాలు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఖండించారు. తండ్రి జూమ్ లో, కొడుకు ట్విట్టర్లో వీరంగాలు వేస్తుంటారు. విష ప్రచార బాధ్యతలు ఎల్లో మీడియా చూసుకుంటోంది. ప్యాకేజీ పార్టీలు కారాలు, మిరియాలు నూరుతుంటాయి. ఎవరికీ ప్రజాదరణ లేదు. విశ్వసనీయత అసలే లేదు. అయినా నిత్యం తాటాకు చప్పుళ్లు చేస్తూనే ఉంటారు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విభజించి పాలించు సిద్ధాంతాలు..
బీసీలు, దళితులు ఐక్యంగా ఉంటే చంద్రబాబుకు కడుపు మంట అందుకే వాళ్లలో వారికే చిచ్చుపెడుతున్నాడు. అది పలాస అయినా, వెలగపూడి అయినా నీ విభజించి పాలించు సిద్ధాంతాలు బ్రిటిష్ వారిని మించిపోతున్నాయి.
దిగజారుడు రాజకీయాలు చేయడానికిది బ్రిటిష్ వారి కాలం కాదు బాబూ? అంటూ అంత‌కుముందు ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

Back to Top