ఎక్కడికి వెళ్లినా చంద్రబాబువి ఇవే ఆర్తనాదాలు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప‌ద‌వీ కాంక్ష‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్రజలు తిరుగుబాటు చేసి అర్జెంటుగా తనను సిఎం సీటు ఎక్కించాలంట! ఎక్కడికి వెళ్లినా చంద్రబాబువి ఇవే ఆర్తనాదాలు, వేడుకోళ్లు, ఏడుపులు, పెడబొబ్బలు. శ్రీలంకలోలా ప్రభుత్వాన్ని కూల్చాలని కొన్నాళ్లు గొంతు చించుకుని అరిచి అరిచి సొమ్మసిల్లాడు. ఇప్పుడు మళ్లీ కలవరిస్తున్నాడు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

పిచ్చి అనుకుంటున్నారు బాబూ!
నీమీద నీకు నమ్మకం లేకనే కదా బాబూ, ఎవరెవరినో ఊతకర్రలుగా చేసుకున్నది. పుత్రరత్నం కూడా అప్రయోజకుడు. 'ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. మెంటల్ గా యమ ఇదిగా ఉన్నా' అని నువ్వు పదే పదే చెప్తుంటే  ‘పిచ్చి’ అనుకుంటున్నారు ప్రజలు. నీవన్నీ మాయల ఫకీరు వేషాలు అనుకుంటున్నారు అంటూ అంత‌కు ముందు మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top