ఏపి విద్యుత్తు బిల్లు-2020 దేశంలోనే విప్లవాత్మకమైనది

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: రాష్ట్రపతి ఆమోదించిన ఏపి విద్యుత్తు బిల్లు-2020 దేశంలోనే విప్లవాత్మకమైనద‌ని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  యూనిట్ పై విధిస్తున్న 6 పైసల సుంకం ఇకపై పీక్-నాన్ పీక్ వేళలను బట్టి అమలవుతుంది. ఓపెన్ మార్కెట్లో యూనిట్ రూ. 2-3 ఉంటే కమిషన్లకు కక్కుర్తిపడి 4.80 చెల్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు బాబు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

తాడు బొంగరం లేదు, తెగిన గాలిపటంలా ఎగురుతూ పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు. బ్యాంక్స్ ని నిండా ముంచి ఎప్పుడు ఏ దేశానికి ఎగిరిపోతాడో తెలియదు.యూరో బేరగాడు యూరప్ కే  పోతాడా? నియోజకవర్గంకి వస్తే జనం చెప్పులతో  స్వాగతం చెప్తారు. వాడు కూడా పచ్చ మీడియా సాక్షిగా నీతులు చెప్పేవాడే రామ రామ అంటూ విజ‌య సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వతంత్ర భారతావని నేడు వజ్రోత్సవ సంబరం జరుపుకొంటోంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం ఎందరో యోధులు ఎనలేని త్యాగాలు చేశారు.  ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ పౌరులందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top