నిర్ధిష్ట కాలపరిమితిలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్

విశాఖ‌: వైజాగ్ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి వాల్తేర్ డివిజన్ విడగొట్టవద్దని నా అధ్యక్షతన కామర్స్  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. నిర్ధిష్ట కాలపరిమితిలో జోన్ ఏర్పాటు చేయాలి. ఈ జోన్ నుంచి వాల్తేర్ డివిజన్ విడగొట్టాలన్న ప్రతిపాదనను విరమించుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విభజనతో నష్టపోయిన ఏపీతోపాటు చత్తీస్ గఢ్, ఝార్ఖండ్ కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని నా అధ్యక్షతన కామర్స్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. విభజన వల్ల రాజధాని కోల్పోయిన లద్దాఖ్ కు కేంద్రం  5,958 కోట్లు, కశ్మీర్ కు1.08 కోట్లు ఇచ్చింది. ఏపీకి కూడా ఇదే తరహా కేటాయింపులు చేయాల‌ని మ‌రో ట్వీట్ చేశారు. 

విద్యార్థుల సమ్మతి మేరకు ‘జగనన్న అమ్మఒడి’, ‘వసతి దీవెన’ స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి నిర్ణయం మేరకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. ల్యాప్‌టాప్‌ల  కోసం 6 లక్షల మందికిపైగా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top