నిమ్మ‌గ‌డ్డ గారూ..హైకోర్టు తీర్పుపై ఎక్క‌డికి వెళ్తారు?

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విజ‌య‌వాడ‌:  ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఏక‌ప‌క్షంగా ఇచ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయ్యా, నిమ్మగడ్డ గారూ...హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా లేక చంద్రబాబు ఇంటికి వెళతారా..? చెప్పండి ప్లీజ్..!  అంటూ ట్వీట్ చేశారు.

మహాభారతంలో సైంధవుని పాత్రే ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబుది. అన్నింటికీ అడ్డం పడతాడు సైంధవుడు - కానీ అది తాత్కాలికమే. ఎందరు సైంధవులు వచ్చినా - సంక్షేమ మహా యజ్ఞం ఆగదు. సైంధవ సంహారం కోసం అర్జునుడు  పశుపతాస్త్రం ప్రయోగించాడు. చంద్రబాబుపై జనం ప్రజాస్వామ్య  అస్త్ర ప్రయోగం తప్పదంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు.

నిమ్మగడ్డతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పించి ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మఒడి సాయాన్ని ఆపాలనుకోవడం... ఆరోజుల్లో కళ్లెర్రజేసి సముద్రాన్ని కంట్రోల్ చేశా, తుఫానును అడ్డుకున్నానని కోతలు కోయడం లాంటివే బాబు. ఏదో చేయాలనుకుంటావు కానీ ఏమీ జరగదు. భ్రాంతి నుంచి బయటపడు అంటూ మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top