ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయి అచ్చన్న

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విజ‌య‌వాడ‌: పార్టీ లేదు బొక్కా లేదన్న మీ మాటల దెబ్బకు ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయి అచ్చన్న అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. తోలు మందం వల్ల మీకు తెలియడం లేదు. రెఫరెండం కోరాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుగా అచ్చం. 

ప్రజల్లో వైయ‌స్‌ జగన్ కు వ్యతిరేకత ఉందని టీడీపీ నమ్మితే...టీడీపీ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి గెలవాలి. పక్కన కేసీఆర్ అనేక సార్లు రాజీనామా చేసి గెలిచి  తెలంగాణ సెంటిమెంట్ ఉందని ప్రూవ్ చేసాడు. కనీసం ఆత్మకూరు ఎన్నికల్లో అయినా పోటీ చేస్తే  తేలిపోయేదిగా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top