ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

న్యూఢిల్లీ:  తెలుగు దేశం పార్టీని ఏపీ ప్ర‌జ‌లు ఎప్పుడో తిర‌స్క‌రించార‌ని, చంద్ర‌బాబు విడుద‌ల చేసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను మొద‌టి రోజే తిప్పి కొట్టార‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. టీడీపీ పంచాయతీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు. ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిమ్మగడ్డ సుతిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా? ఎల్లో మీడియాను రోజంతా ఎంగేజ్ చేయడానికి ఆ తతంగం పెట్టుకున్నాడు. 

ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో.... దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.  ఓర్పుతో ఉంటే ఓటమిని కూడా ఓడించగలవు అంటూ ఇవాళ ఉద‌యం చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top