విశాఖ: ఎన్టీఆర్ భవన్ లో ఏం వ్యాపారాలు చేస్తున్నావు చంద్రబాబూ? అంటూ వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. పార్టీ ఆఫీసులో ప్రైవేట్ కాల్ సెంటర్, హోటళ్లు, లాడ్జీలు నడుపుతావా? అందుకేనా కరకట్ట కొంప వదిలి హైదరాబాద్ లో మకాం వేశావు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకుని ఎన్టీఆర్ కే కాదు అయన ఆశయాలు, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావ్. బాబుకు అర్థమైంది.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని చూడలేదు. విద్య. ఆరోగ్య వసతులు పెంచాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. పసుపు- కుంకుమ పేరుతో 10 వేలు విదిలించి ఎన్నికల గట్టు దాటొచ్చుకున్నాడు. ఓటుకు రేటు కట్టి పంపిణీ చేస్తాడు. జగన్ గారి ‘సంక్షేమం’ చూసి మళ్లీ గెలవడం అసంభవమని అర్థమైంది బాబుకు అంటూ వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.