విశాఖ: ఉత్తరాంధ్ర అభివృద్ధి వైయస్ జగన్‌తోనే సాధ్యమని, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలించాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా తీసుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర రాజధానిని అమరావతిలో పెట్టాలనే నిర్ణయాన్ని మార్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో విశాఖపట్నంను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా ప్రకటించారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలనే నిర్ణయాన్ని సీఎం వైయస్ జగన్ ధైర్యంగా తీసుకున్నారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే..వెనుకబడిన ఉత్తరాంధ్ర, విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. మూడు జిల్లాలు చాలా సుందరంగా అభివృద్ధి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖకు మెట్రో రైలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖకు మంచినీటి సదుపాయం కల్పించాలని, సాగునీటి వసతి కల్పించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పురుషోత్తం పట్నం నుంచి ఇక్కడికి నీరు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించింది. విశాఖ జిల్లాను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఇక్కడికి రప్పించాలని మంచి ఉద్దేశ్యంతో కార్యక్రమాలు చేపడుతున్నాం. వైయస్ జగన్ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు హర్షిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో 98 స్థానాలకు 98 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే దేశంలోనే విశాఖను అత్యుత్తమ రాజధానిగా వైయస్ జగన్ తీర్చిదిద్దుతారు. ఉత్తరాంధ్ర ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డారు. అభివృద్ధి, స్థూల ఆదాయం సాధించాలంటే వైయస్ఆర్‌సీపీని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని విజయసాయిరెడ్డి కోరారు.