మూడు రాజధానులకే ప్రజలు ఓటేశారు

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజయసాయిరెడ్డి  

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఒప్పుకున్నారు

ఇది 13 జిల్లాలలోని 5 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పు

టీవీలు చూసి కాకుండా, సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓటేశారు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చూసి మద్దతు ఇచ్చారు

విశాఖ‌:  మూడు  రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌లు ఓటేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఉన్న విశ్వాసం ఒక రాష్ట్ర చరిత్రను ఎలా మారుస్తుంది అన్న విషయం ఈ తీర్పుతో చాలా స్పష్టమైందన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజలు సంతోషకరంగా, మనస్ఫూర్తిగా ఇచ్చిన తీర్పు ఇది అన్నారు.   టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, టీడీపీ, జనసేన, సీపీఐ, ఎల్లో మీడియా కలిసినా ప్రజలు వైయ‌స్సార్‌ సీపీకి పట్టం కట్టారని  అన్నారు. బేవర్స్ రాజకీయాలు చేసే వ్యక్తి సబ్బం హరి అంటూ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ మంత్రి లోకేష్ బాబు ఏపీకి టూరిస్టులంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం మంత్రులు క‌న్న‌బాబు, అవంతి శ్రీ‌నివాస్‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. 

 5 కోట్ల మంది తీర్పు:
    ‘స్థానిక ఎన్నికలను అవి స్థానిక ఎన్నికలు అన్న అభిప్రాయం కలిగించకుండా చంద్రబాబు తమకు అర్బన్‌ ప్రాంతంలో చాలా పట్టు ఉందని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైందని అసత్య ప్రచారం చేశారు. ఇంకా ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్, మరోవైపు ప్రతిపక్ష హోదా కలిగిన తెలుగుదేశం పార్టీ, ఇంకా జనసేన, సీపీఐ కలిసికట్టుగా ఎల్లో మీడియాతో కలిసి చేసిన ప్రయత్నానికి ప్రజలు ఇవాళ పెద్ద తీర్పు చెప్పారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 13 జిల్లాలలోని 5 కోట్ల మంది ప్రజల మనసుల్లో, ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన, సంక్షేమ పాలన, అభివృద్ది పాలన మనసుల్లో గూడు కట్టుకుంది అన్న విషయం తేటతెల్లమైంది. ఆ విధంగా ప్రజలు తీర్పు చెప్పారు’.

సుపరిపాలనకు ఓటు:
    ‘సీఎం వైయ‌స్ జగన్‌ గారు ప్రచారం చేయలేదు. మీడియాతో మాట్లాడలేదు. ఒక ప్రకటన చేయలేదు. ఓటు అడగలేదు. కానీ ఆయన గొప్ప పాలన చూసిన ప్రజలు, ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ప్రజలకు ఉన్న విశ్వాసం ఒక రాష్ట్ర చరిత్రను ఎలా మారుస్తుంది అన్న విషయం ఈ తీర్పుతో చాలా స్పష్టమైంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజలు సంతోషకరంగా, మనస్ఫూర్తిగా ఇచ్చిన తీర్పు ఇది. అదే స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు. 
ఇది అభివృద్ధి పనులకు వేసిన ఓటు. వాగ్దానాల అమలుకు, ప్రభుత్వ పనితీరుకు వేసిన ఓటు. జగన్‌ గారి పరిపాలనకు అర్బన్‌ ఓటరు, రూరల్‌ ఓటర్లు వేసిన ఓటు’. 

మూడు రాజధానులకు మద్దతు:
    ‘ఇక మూడు రాజధానులకు సంబంధించి, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధానితో పాటు, మూడు రాజధానులకు రాçష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు, అమరావతి ప్రజలు కూడా సమర్థిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది. చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు పప్పునాయుడు ఎన్నికల ప్రచారం కోసం విశాఖకు వచ్చి నీతి మాలిన రాజకీయాలు చేశారు. ఎగ్జిక్యూటిక్‌ రాజధానిని వ్యతిరేకించిన చంద్రబాబుకు, ఆయన కుమారుడు పప్పునాయుడుకు ఇటు విశాఖ ప్రజలు, అటు విజయవాడ ప్రజలతో పాటు, మంగళగిరిలో తన కొడుకును ఓడించిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’.

రెచ్చగొట్టాలని చూస్తే..!:
    ‘అటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి, మీకు రోషం, పౌరుషం లేదా? అని ప్రజలను రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నించారు. అందుకు అక్కడి ప్రజలు తమ రోషం, పౌరుషాన్ని చక్కగా చంద్రబాబు మీదే చూపించారు. ఎన్నికల రోజు చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా ముఖం చాటేశాడంటే, ఇది ఇక్కడి ప్రజలకే సిగ్గు చేటు అన్న విషయం తెలుస్తోంది’.

మనోభావాలు దెబ్బ తీశారు:
    ‘ఏపీ ప్రజలు పాచి పనుల కోసం వేరే రాష్ట్రాలకు పోతున్నారని అన్నారు. మరి నీ కొడుకు, నీవు హైదరాబాద్‌లో పాచి పనుల కోసం వెళ్లారా?. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తీసే మాట కాదా? అని ప్రశ్నిస్తున్నాను. ఏపీకి రావడానికి ముఖం కూడా చెల్లని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు భవిష్యత్తులో రాష్ట్రానికి వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు’.

టూరిస్టు నాయకులు:
    ‘ఇక పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్‌ ఇద్దరూ కూడా ముందుగానే ఏపీ విడిచి వెళ్లిపోయారు. ఏపీలో ఏ రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు లేరు. వీరు అంతా ఊర్కే మీడియాతో మాట్లాడతారు.
వీళ్లందరినీ కూడా టూరిస్టు నాయకులు అంటారు. అప్పుడప్పుడు టూరిస్టుల మాదిరిగా రాష్ట్రానికి వచ్చి ఏదేదో మాట్లాడి పోతుంటారు. ఇకనైనా వీరందరికీ ఇకనైనా వారికి బుద్ది వస్తుందని ఆశిస్తున్నాను’.

చెత్త డిబేట్లు–విమర్శలు:
    ‘ఎల్లో మీడియాలో రోజూకో చెత్త మాటలు. ఒక డిబేట్‌ పెట్టి వీరందరూ కూడా రఘురామకృష్ణంరాజుతో మాట్లాడిస్తారు. ఆయన రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఇంకొకాయన విశాఖలో బేవార్సు రాజకీయం చేస్తుంటాడు. ఆయన సబ్బం హరి. ఆయనను దిగ్గజం విశ్లేషకుడు అని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఆయన దేంట్లో దిగ్గజమో నాకైతే అర్ధం కావడం లేదు. అటువంటి బేవార్సు రాజకీయాలు చేసేటువంటి వారిని విశ్లేషకుడిగా పెట్టుకుని, శాంతి కాముకులైన విశాఖ ప్రజల మనోభావాలను వారంతా దెబ్బ తీస్తున్నారు’.
    ‘ప్రజలంతా టీవీలను చూసి కాదు. గౌరవ ముఖ్యమంత్రి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనేది చూసి ఓటేస్తున్నారు’.

ఏం సమాధానం చెబుతావు?:
    ‘2019 ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేసుకుందాం.  ఈవీఎంలను ఎవరో ట్యాంపర్‌ చేశారని అప్పుడు ఆయన ఆరోపించారు. కానీ ఇవాళ పార్టీ ఎన్నికల గుర్తుతో స్వస్తిక్‌ మార్కుతో బ్యాలెట్లతో ఓటింగ్‌ జరిగింది. మరి ఇప్పుడు కూడా ఓడిపోయావు. మరి దీనికి ఏం సమాధానం చెబుతావు. ఈవీఎం అయినా, మాన్యువల్‌ ఓటింగ్‌ అయినా చంద్రబాబును ఓడించారు. అదే ప్రజల నిర్ణయం’.
    ‘చంద్రబాబు నిన్ను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు సిగ్గు లేదు. బుద్ధి లేదు అన్నావు కదా?. సాయంత్రం ప్రెస్‌ మీట్‌ పెట్టి తిట్టగల మెంటల్‌ కేసు మన ప్రతిపక్ష నాయకుడు నీవేనని నేను చెబుతున్నాను’.

విశ్లేషించుకోండి:
    ‘ఇక ఏకగ్రీవాలను ఒప్పుకోబోమని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పారు. అదే మాట చంద్రబాబు కూడా చెప్పారు. మరి ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయన్నది విశ్లేషించుకోండి. ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదని.. చంద్రబాబు వల్ల కాదని.. నిమ్మగడ్డ వల్ల కూడా కాదని.. ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి’.

వీరు మారరు కాక మారరు:
    ‘అయినా ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెడుతున్నా, ఓటమికి చెత్త కారణాలు చూపించి సుత్తి కొడుతున్నా, ఇవ్వక తప్పదని ఎల్లో మీడియాలు ముఖాలు వేలాడేసుకుని, గెలుపు కంటే ఓటమి గొప్పదని డిబేట్లు నడిపించేందుకు రెడీ అవుతున్నారట. ఇది ఎల్లో మీడియా పరిస్థితి. వీరు మారరు కాక మారరు. ప్రజల తీర్పు మారదు’.
    ‘వైయస్సార్‌సీపీ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు పరిపాలిస్తుందనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను’.

ఆ ఫలితాలు అసంతృప్తినిచ్చాయి:
    ‘ఇవాళ విశాఖపట్నంలో.. జీవీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు చూశాక నాకు కొంత అసంతృప్తి ఉంది. మా నాయకుడు, గౌరవ సీఎం గారికి కూడా ఈ విçషయం చెబుతాను. ముఖ్యంగా ఈరోజు చాలా నియోజకవర్గాలలో గాజువాక, బీమిలి, పెందుర్తి, విశాఖ దక్షిణంలో చాలా వార్డులు మేము పొగొట్టుకున్నాం. ఇది అనుకోని పరిణామం. అందుకు కారణాలు విశ్లేషించుకుంటాం. మా నాయుకులతో చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటాం’.
    ‘ఒక్క గాజువాకలో 11 స్థానాలు, బీమిలిలో 5 స్థానాలు, పెందుర్తిలో 7 స్థానాలు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 5 స్థానాలు పోగొట్టుకున్నాం.
అవి ఎందుకు పోగొట్టుకున్నామన్నది విశ్లేషించుకుంటాం. మాకు ఇది ఒక గుణపాఠం అని వ్యక్తిగతంగా భావిస్తున్నాను’.

ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను:
    ‘విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 స్థానాలలో 15, పశ్చిమ నియోజకవర్గంలో 14 స్థానాలలోలో 10, తూర్పు నియోజకవర్గంలోలో 10 స్థానాలు గెల్చాము. అనకాపల్లిలో 5 స్థానాలలో 4 స్థానాలను మా అమర్‌ గెల్చుకొచ్చాడు. ధన్యవాదాలు. కెకె రాజును, మల్లాది జయప్రసాద్‌ను అభినందిస్తున్నాను. తూర్పులో విజయనిర్మల, వంశీకృష్ణ శీనివాస్‌ యాదవ్‌ను అభినందిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో పని చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తను అభినందిస్తూ, అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’.. అంటూ శ్రీ వి.విజయసాయిరెడ్డి ప్రెస్‌ మీట్‌ ముగించారు.

చంద్రబాబుకు ప్రజలు రిజెక్ట్‌ బటన్‌ నొక్కారు: కె.కన్నబాబు, మంత్రి
– ‘సీఎం గారికి మరోసారి మద్దతు లబించింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు. ఒక నాయకుడు 21 నెలల పాలన తర్వాత ఎన్నికలు జరిగినా బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. నిజానికి ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. ఎవరినీ ఓటు అడగలేదు. అయినా అఖండ విజయం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 98 శాతం స్థానాలు ఇచ్చారు. దీంతో కలిపి ఇప్పటి వరకు చంద్రబాబునాయుడు ప్రజలు మూడు సార్లు రిజెక్ట్‌ బటన్‌ నొక్కారు’.
    ‘చంద్రబాబు, ఆయన కుమారుడు విశాఖ వచ్చి, ప్రజలను ఏం పీకుతున్నారు అని అడిగారు. అందుకే ప్రజలు ఆ పార్టీని, వారి అహంభావాన్ని పీకేశారు. ఏ నాయకుడు అయినా ఒదిగి ఉండాలి. ప్రభుత్వం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. కేవలం 18 నెలల కాలంలోనే దేశంలోనే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మూడో స్థానంలో నిల్చారు. ఇప్పుడు అర్బన్‌ ఎన్నికల్లో కూడా విజయం సాదించి ఇంకా ముందుకు వెళ్లారు’.
    ‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తామే చేస్తున్నామని కేంద్రం స్పష్టంగా చెప్పినా, చంద్రబాబునాయుడు అండ్‌ కో.. అందుకు జగన్‌ గారు కారణమని అసత్య ప్రచారం చేశారు. దీంతో గాజువాకలో మేము గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. గెలిపించారు’ అని పేర్కొన్నారు.

Back to Top