దొంగల ముఠా కుట్రలు మొదలుపెట్టింది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

అమరావతి: అవినీతిలో కూరుకుపోయిన పచ్చ నేతల్ని కాపాడుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెగ ఉబలాటపడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చేయాల్సిన ‘అతి’ని ఇప్పుడే మొదలు పెట్టారని ట్వీట్‌ చేశారు. ‘యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీయిజం రాజ్యమేలింది. ఇప్పుడక్కడ ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోంది’అని అన్నారు.
‘నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరిన చందంగా చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయి 100 రోజులే అయింది’అని ట్వీట్‌ చేశారు. 
 

Back to Top