ఉరవకొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోలోని 98 శాతం వాగ్దానాలను మూడున్నరేళ్ల పాలనలోనే అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్ఆర్ సీపీ ఎంపీ తలారి రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు మండలం ఎన్. తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడప గడపకూ వెళ్లి సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా అర్హత ఒక్కటే ఆధారంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.