సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌తీ కుటుంబానికి ల‌బ్ధి

ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం చాబాలలో గడప గడపకు మన ప్రభుత్వం

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

ఉరవకొండ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌తీ కుటుంబానికి ల‌బ్ధి చేకూరింద‌ని, ప్ర‌జ‌లే స్వ‌యంగా చెబుతున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ త‌లారి రంగ‌య్య‌, ఉర‌వ‌కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చాబాల‌లో ఎంపీ తలారి రంగ‌య్య‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గడప గడపకు తిరుగుతూ ప్ర‌జ‌ల యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు. అర్హ‌త ఉండి పథకాలు అందని వారు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సంద‌ర్భంగా గడిచిన మూడేళ్ళలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ప్రజలకు వివరించి బుక్లెట్లను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌తి కుటుంబానికి మేలు జ‌రిగింద‌ని, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌న్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు, గ్రామ వ‌లంటీర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top