బెలుగుప్పలో 'జగనన్న పచ్చతోరణం' ప్రారంభం

  మొక్కలు నాటిన ఎంపీ రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

 ఉరవకొండ: రాష్ట్రాన్ని హరితాంద్రప్రదేశ్ చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి స్థానిక పిహెచ్సి ఆవరణలో మొక్కలు నాటి ప్రారంభించారు. చెట్ల పెంపకాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని, ఒక యజ్ఞంలా నిర్విరామంగా సాగేలా చేయాలని వారు పిలుపునిచ్చారు.  

  మహానేతకు ఘన నివాళి
  
దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, వైయ‌స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. బెలుగుప్ప మండల కేంద్రంలో ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే ,నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 12 ఏళ్ళు దాటినా ఆయనను మరువలేమన్నారు.ఉరవకొండలో వైస్సార్సీపీ నాయకులు శ్రీనాత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top