పేదలందరికీ ధైర్యం, భరోసా సీఎం వైయస్‌ జగన్‌

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌

కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

వెంకటాయపాలెం:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదలందరికీ ధైర్యం, భరోసా అని బాపట్ల ఎమ్మెల్యే నందిగం సురేష్‌ పేర్కొన్నారు. వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ సురేష్‌ మాట్లాడారు.

నందిగం సురేష్‌ ఏమన్నారంటే..
జగనన్నకు అణగారిన జాతులన్నీ రుణపడి ఉంటాయి. ముందుగా ఈ ప్రాంతానికి మీరు వచ్చినప్పుడు చంద్రబాబు పసుపు నీళ్లు చల్లించారు. జగనన్న వచ్చిన తరువాత మా అందరికీ ఓ భరోసా, ధైర్యం వచ్చింది. పేదవాడి పక్కన వైయస్‌ జగన్‌ ఉంటే, చంద్రబాబు పెత్తాందార్ల పక్కన తిరుగుతున్నాడు. వాళ్లతో కలిసి మా అందరితో చంద్రబాబు యుద్ధం చేస్తున్న తరుణంలో మా పక్షాన మీరు నిలబడి కోర్టుల్లో గెలిచి ఇవాళ సామాన్యులకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు కట్టిస్తున్నారు. జీవితకాలం పేదవాడి గుండెల్లో, పేదవాడి ఇంట్లో, పేదవాడి కళ్లలో కనిపించేది జై జగన్‌ అనే నినాదం మాత్రమే. 
ఎవరు చెప్పినా, ఎంతకాలం చెప్పినా ఇళ్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని భుజం మీద చెయ్యి వేసి ఎన్నికల్లో గెలిచిన తరువాత పీక మీద కాలు వేసి తొక్కిన చంద్రబాబు లాంటి వ్యక్తులను మేమందరం చూశాం. పేదవాడిని కోటిశ్వరుడిని చేయవచ్చు అన్న మీ సంకల్పం గొప్పది. ఒక సామాన్యుడిని పార్లమెంట్‌కు పంపించగలిగే దమ్ము మీకు మాత్రమే ఉంది జగనన్న. సామాన్యుల ఆకలి, పేదవాడి బాధ మీకు తెలుసు, పేదవాడి చెమట వాసన మీకు తెలుసు కాబట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చారు. 
ఇవాళ మీరు చెబుతున్నట్లు వై నాట్‌ 175 అన్నదానికి ఒక రీజన్‌ చెబుతున్నాను. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి పట్టుమని 20 హామీలు కూడా నెరవేర్చలేదు. మీరు నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి 99 శాతం హామీలు నెరవేర్చిన మీరు వై నాట్‌ 175 అనడంలో ఆశ్చర్యమే లేదు. మీరు గెలవాలి. మా జీవితాలను బాగు చేయాలని మనసారా కోరుకుంటూ..మా అందరి ప్రేమానురాగాలతో ఎల్లవేళలా మీరు చల్లగా ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులతో మరో 15 ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని కోరుకుంటారని, పేదల పక్షాన యుద్ధం చేస్తున్న జగనన్నకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని నందిగం సురేష్‌ పేర్కొన్నారు. 

 

Back to Top