చంద్రబాబు డర్టీ పొలిటీషియన్‌

వయసు పెరిగేకొద్దీ వింతవ్యాధిగ్రస్తుడిలా మాట్లాడుతున్నాడు

నోరు అదుపులో పెట్టుకోకపోతే తండ్రీ కొడుకుల్ని మడతేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ఎంపీ  నందింగం సురేష్‌ ఫైర్‌

వైయ‌స్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ శ్రీ నందిగం సురేష్‌ ప్రెస్‌మీట్ః

అమరావతిని కుల రాజధానిగా మార్చింది చంద్రబాబే..

ఆనాడు పంటపొలాల్ని తగులబెట్టించిన దగుల్భాజీ అతడే..

ఆ ఘటనలో ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌ల హస్తం ఉందనేది యథార్థం

ఎస్సీలపై నిందలేయడం మానేసి .. మీరు నార్కో టెస్టుకు సిద్ధమా..?

అమరావతి భూముల కుంభకోణంపై నాతో చర్చకొచ్చే దమ్ముందా..?

24 గంటల్లోగా నా సవాల్‌ను స్వీకరించకుంటే మీరు చేవలేని దద్దమ్మలని ఒప్పుకోండి

సవాల్‌ విసిరిని ఎంపీ నందింగం సురేష్‌

 

తాడేప‌ల్లి: చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ  నందింగం సురేష్ విమ‌ర్శించారు. వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్? అంటూ సురేష్‌ నిలదీశారు. రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే. బలవంతంగా భూ సేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన మగోడివైతే మరి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదు?. అబద్దాల బతుకు ఇంకెంతకాలం?. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే’’ అంటూ ఎంపీ సురేష్‌ దుయ్యబట్టారు.వైయ‌స్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఎంపీ నందింగం సురేష్‌.. ఇంకా ఏమన్నారంటే:

వింతవ్యాధిగ్రస్తుడిగా చంద్రబాబు మాటలుః
నారా చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగేకొద్దీ చాదస్తం శృతిమించి పోతుంది. పర్చూరు టీడీపీ మీటింగ్‌లో ఈరోజు ఆయన మాటలు చాలా జుగుప్సాకరంగా.. ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయి. గౌరవ ముఖ్య మంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా మాటలు పేలాడు. రాజధాని అమరాతి పేరిట ఏవేవో నోటికొచ్చిన అబద్ధాలన్నీ కూశాడు. తనకు తాను గొప్పోడిగా డబ్బా కొట్టుకోవడం.. జగన్‌గారిని విమర్శించడం తప్ప.. ప్రజలకు తాను గతంలో చేసిన మంచి ఏంటనేది చెప్పుకోలేని దద్దమ్మగా తయారయ్యాడు చంద్రబాబు. మొత్తానికి ఆయనకు రేపటి ఎన్నికల్లోనూ ఓడిపోతానేమోననే ఫోబియా పట్టుకుంది. అందుకే, ఒక వింత వ్యాధి సోకినోడిలా ఆయన పేట్రేగిపోతున్నాడు. 2019 ఎన్నికల్లోనే ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీని తిర స్కరించి పూర్తిగా మూలనబెట్టారనే విషయాన్ని విస్మరించి.. ఇప్పటికీ, నేను వీరుడ్ని, శూరడ్ని అని చెప్పుకుంటున్నాడు. నిజంగా, ఆయన చపలత్వపు మాటలకు బాధపడాల్సిందే. 

నువ్వే గొప్పొడివైతే.. పవన్‌కళ్యాణ్‌తో పొత్తెందుకు..?ః
సుదీర్ఘకాలం రాజకీయాల్లో అనుభవశాలిగా చెప్పుకునే నువ్వు.. ప్రజల ముందుకొచ్చి ఏం మాట్లాడాలో.. ఏం చెప్పుకోవాల్నో కూడా తెలుసుకోలేక పోతున్నావు. ఎప్పటికప్పుడు పొత్తుల బేరంతో ఎన్నికలకు వెళ్లే నువ్వు.. ధైర్యంగా ఒంటరిగా పోటీచేయలేని దద్దమ్మవు. నిజంగా, నీ పార్టీ తెలుగుదేశం అంత బలమైన శక్తివంతమైన దైతే.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నీ అభ్యర్థుల్నే నిలబెట్టి గెలిపించుకోవచ్చు కదా..? 2014లో నీకు పవన్‌కళ్యాణ్‌ సహకారం ఎందుకు అవసరం అనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే పవన్‌కళ్యాణ్‌ కాళ్లు పట్టుకుని ఎందుకు వేలాడు తున్నావు..? రాజకీయంగా నీ శక్తిసామర్థ్యాలు సన్నగిల్లిపోయాయని బహిరంగంగా ఒప్పుకో చంద్రబాబు. లేదంటే, పవన్‌కళ్యాణ్‌ పార్టీ సహకారం అవసరం లేదని ఒంటరిగా పోటీచేసి .. మా నాయకుడు జగన్‌ గారిపై గెలిచి నిలబడాలని సవాల్‌ విసురుతున్నాను. 

నువ్వూ, నీ కొడుకూ పెద్ద చెత్తః
నీ రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే కదా..? నువ్వు రాజకీయ అరంగేట్రం ఏ నియోజకవర్గం నుంచి ప్రారంభించావు..? ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నావు..? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకొచ్చావు..? అక్కడి చెత్త ఇక్కడ నీకు మాత్రమే బంగారం అయ్యిందా..? నీ కొడకు లోకేశ్‌ మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నాడు..? అసలు, మంగళగిరికి మీ కుటుంబానికి ఏం సంబంధం ఉంది..? నువ్వూ.. నీ కొడుకు లోకేశ్‌ కలిసి అక్కడ బీసీ సామాజికవర్గ సీటును కొల్లగొట్టింది నిజం కాదా..? ఇదే గంజి చిరంజీవి టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు సీటిస్తామని చెప్పి ఆర్థికంగా గుల్ల చేసింది మీరు కాదా..? రాజకీయాల్లో చెత్త నాయకులెవరయ్యా.. అని భూతద్దం వేసి చూస్తే నువ్వూ.. నీ కొడుకు లోకేశ్‌తో పాటు నీ వదిన పురందేశ్వరి కూడా పరమ చెత్తగా కనిపిస్తారు. 

నువ్వొక డర్టీ పొలిటీషియన్ః
నువ్వొక డర్టీ పొలిటీషియన్‌ అని కేసీఆర్‌ గతంలోనే చెప్పాడు. ఓటుకు నోటు కేసులో భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలేసి పారిపోయి వచ్చిన దరిద్రుడివి నువ్వు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే నువ్వు చంకలెగరేశావు.. టీడీపీ జెండాలతో నీ పార్టీ కేడర్‌ ఊరేగింది. ఇప్పుడేమో.. తగుదునమ్మా..అంటూ విభజనతో రెండు రాష్ట్రాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని పర్చూరులో చెబుతున్నావు. ఎప్పుడు ఏం మాట్లాతావో.. నాలుక ఎలా మడతేస్తావో.. నీకే తెలియదు. నీ అంత స్వార్థబుద్ధి గల డర్టీ పొలిటీషియన్‌ రాజకీయాల్లో ఎవరూ ఉండరు గాక ఉండరు. 

అమరావతిని కుల రాజధాని చేసింది నువ్వే..
రాష్ట్ర విభజనతో ప్రజలు నువ్వేదో అనుభవశాలివని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే.. ఈ రాష్ట్రానికి ఏం చేశావు..? అమరావతిని ఖచ్చితంగా.. నూటికి నూరుపాళ్ళూ కుల రాజధానిగా మార్చింది నువ్వే.. అమరావతిని కాస్తా భ్రమరావతిగా చేసి ఇక్కడ రైతుల్ని సర్వనాశనం చేశావు. మూడు పంటలు పండే పచ్చని పొలాల్ని దౌర్జన్యంగా లాక్కుని రైతుల్ని రోడ్డు పాల్జేసింది నువ్వే.. ఇక్కడ రైతుల్ని భయపెట్టావు. దాడులు చేయించావు. ఆనాడు పోలీసుల్ని అడ్డంపెట్టుకుని అక్రమ అరెస్టులు చేయించావు. పైగా, ఇప్పుడు రాజధాని ఫైల్స్‌ పేరిట ఆత్మవంచన చేసుకుని సినిమా తీయించావు. ఆనాడు నువ్వూ.. నీ సామాజికవర్గ దాడికి భయపడి ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు ఊర్లు వదిలి పారిపోయారు. నీ సామాజికవర్గ రియల్‌ ఎస్టేట్‌దారుల చేతుల్లోకి రాజధాని భూముల్ని పెట్టింది ఖచ్చితంగా నువ్వే.. ఇప్పుడు రైతు నిరసన శిబిరాల్లో ఉన్నది కూడా రైతులు కాదు.. వారంతా రియల్‌ ఎస్టేట్‌దారులేననేది నిజం. 

పొలాల్ని తగులబెట్టించిన దగుల్భాజీ నువ్వే..
రాజధాని పేరిట భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యాలు చేయడమే కాకుండా.. అప్పట్లో పంటపొలాల్ని కూడా తగులబెట్టించిన దగుల్భాజీలు మీరేనని ఘంటాపథంగా చెప్పగలను. టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు కలిసి ఆనాడు పోలీసుల చేత పొలాలకు నిప్పు పెట్టించింది నిజం కాదా..? 

ఎస్సీ, ఎస్టీలపై నిందలేసి దొంగల్ని చేస్తారా..? 
పంటపొలాల్ని కాల్చిన వైనంపై వాస్తవాల్ని దాచిపెట్టి.. నాలాంటి ఎస్సీ నేతలపై నిందలేస్తారా..? ఇప్పటికే నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ అత్యంత హేయంగా .. ఛీత్కరించావు. మళ్లీ ఇప్పుడు లేని అబద్దాలు సృష్టించి దొంగ ముద్ర వేస్తున్నావు. ఇక, రాజకీయాల్లో నీకు, నీ కొడుకు లోకేశ్‌కు పుట్టగతులుండవు. 

నార్కో టెస్టుకు సిద్ధమా..? 
అమరావతి పంట భూముల్ని తగులబెట్టిన విషయంలో మీ నిందల్లో నిజముందని నీ మనువడి మీద ప్రమాణం చేసి చెబుతావా చంద్రబాబూ..? నువ్వు గానీ.. నీ భార్య.. నీ కొడుకు గానీ.. టీడీపీలో ఏ గొట్టంగాడైనా ఈ విషయంపై నార్కో టెస్టుకు సిద్ధమా..? నేను చంద్రబాబుకు, లోకేశ్‌కు, ఆయన పార్టీ నేతలకు ఒక సవాల్‌ విసురుతున్నాను. ఆరోజు వారే పంటపొలాల్ని కాల్చారనే సాక్ష్యాలతో నేనొస్తాను. నాతో చర్చకొచ్చే దమ్మూధైర్యం ఉందా..? ఈ క్షణం నుంచి సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నా.. రాజధాని భూములకు సంబం«ధించి ఆనాడు టీడీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పై నాతో చర్చకు రావాలని సవాల్‌ విసురుతున్నాను. నా సవాల్‌ను స్వీకరించి వస్తే రండి.. లేదంటే, మీరు చేవలేని.. సత్తాలేని దద్దమ్మల్లా ఒప్పుకోండి.

నా మీద పోటీచేసి గెలిచే దమ్ముందా.. బాబూ..?
బాపట్ల ఎంపీగా నేనేమీ చేయలేదంటున్నావుగా.. మరి, నా మీద రేపటి ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి గెలిచే దమ్ముందా చంద్రబాబు..? నిజంగా, నీకు దమ్మూధైర్యం ఉంటే నామీద ఎంపీగా పోటీచేయి. నిన్ను గానీ నేను ఓడించకపోతే రాజకీయాల్నుంచి తప్పుకుంటానని శపథం చేస్తున్నాను. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పెట్టుకుని తిట్టించుకునే ఖర్మ పట్టినందుకు ఏడ్చుకో.. మొన్న జైలుకెళ్లావు. ఆరోగ్యం బాగోలేదన్నావు. లోకంలో ఉన్న  సర్వరోగాలు నీకే ఉన్నాయన్నావు. పదిమంది షూరిటీ ఉండి.. వందమంది లాయర్లు కోర్టుల చుట్టూ పరిగెత్తితే గానీ బయట పడలేకపోయావు. ఇప్పుడేమో.. ప్రజల ముందు వీరుడు.. శూరుడిలా బిల్డప్‌ ఇచ్చుకుంటున్నావు. 

తండ్రీకొడుకుల్ని మడతేసేందుకు సిద్ధం
రాజధాని అమరావతిని, స్కిల్‌డెవలప్‌మెంట్, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ .. ఇలా ఒకటేమిటి.. అనేకం పనుల్లో రూ. లక్షల కోట్లు దింగమింగిన దొంగ చంద్రబాబు. దివంగత వైఎస్‌ఆర్‌ గారి హయాంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడేమో ఆయన కన్న కొడుకు జగన్‌ గారిని చూసి నువ్వు భయపడుతున్నావు. పెయిడ్‌ ఆర్టిస్టులను పోగేసి ఇష్టానుసారంగా పేట్రేగి పోతున్నావేమో.. నీ డబ్బు అహంకారానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు. ఇప్పటికే నిన్ను, నీ కొడుకుని ప్రజలు 2019లోనే మడతేసి పెట్టారు. 

అనంతపురం సభతో నీకు గుండె ఆగుతుందేమో..
 మొన్న విశాఖ, నిన్న ఏలూరు, రేపు అనంతపురం సిద్ధం సభలను చూడబోతున్నావు. రేపు రాప్తాడు సిద్ధం సభలో జగన్‌ గారికి అందే ప్రజాదరణ చూసింతర్వాత నీ గుండె ఆగుతుందేమో.. నీ వయసు అలాంటిది మరి. టీవీ ముందు కూర్చొని బీపీ పెంచుకోకు. సమీపంలో డాక్టర్లును పిలిపించి పెట్టుకో.. ఆ సభలో మా నాయకుడు జగన్‌ గారి ప్రసంగానికి వెల్లువెత్తే జనాదరణకు నువ్వు ఉంటావో.. పోతావో.. ఆలోచించుకో..

జగన్‌ గారే మరోసారి ముఖ్యమంత్రి
చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రంలోని ఊరూరా తిరుగుతూ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంతగా తూలనాడినా.. మాకు ప్రజామద్ధతు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలతో పాటు అన్నివర్గాలు మావైపే ఉన్నాయి. పేదపిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్య చెబుతామంటే బాబు అండ్‌ కో ముఠా కోర్టులకెళ్లారు. నాడు – నేడు పేరిట విద్యావ్యవస్థ సంస్కరణలప్పుడు, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై, పేదలకు ఇళ్ల స్థలాల్ని ఉచితంగా పంపిణీ చేస్తామంటే కోర్టుల్లోనూ వివిధ సందర్భాల్లో మీరు అడ్డుకున్నారు. గతంలో చేసిన పాపాలకు ప్రజల చేతుల్లో చంద్రబాబు అండ్‌ కో ముఠా నాశనం అయ్యే స్థితికి వెళ్తున్నారు. ఓటు అనే ఆయుధం దగ్గర పెట్టుకుని ప్రజలు ఆ ముఠాకు బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రజలంతా జగన్‌గారికే అండగా నిలిచి మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే తపనతో ఉన్నారు.

Back to Top