చంద్రబాబుతోనే ఉండవల్లి శ్రీదేవికి హాని

ఓటు అమ్ముకోమని అంబేడ్కర్‌ చెప్పారా?

శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవం

ఎంపీ నందిగం సురేష్‌ స్పష్టీకరణ

క్రాస్‌ ఓటింగ్‌పై ప్రమాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

మీ సవాల్‌కు నేను రెడీ

ఎమ్మెల్యే శ్రీదేవికి ఎంపి నందిగం సురేష్‌ ధీటైన జవాబు

మీ స్వార్థం కోసం మీ దారి మీరు చూసుకున్నారు

పార్టీ గురించి మాట్లాడటానికి మీకు ఏ అర్హత లేదు

మీరు పార్టీని వీడారు. అయినా మేం గౌరవిస్తున్నాం

ఎందుకంటే మా పార్టీ మహిళలను గౌరవిస్తుంది

తేల్చి చెప్పిన ఎంపీ నందిగం సురేష్‌ 

తప్పు పనికి, కులానికి ఎలాంటి సంబంధం ఉండదు

కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేస్తే ఎవర్నీ ఉపేక్షించరు

ఇవాళ దళిత మహిళ అంటున్న వారు ఆనాడేమన్నారు?

మేకప్‌.. ప్యాకప్‌ అంటూ మిమ్మల్ని విమర్శించ లేదా?

గుర్తు చేసిన ఎంపీ నందిగం సురేష్‌

మీరు కళ్లు మూసుకుని లోకమంతా అలాగే అనుకోవద్దు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటు అమ్ముకున్నారనేది  వాస్తవం

ఎవరు, ఎక్కడ, ఎలా రాయబారాలు చేసిందో తెలియదా?

మీ బేరసారాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు

ఎంపీ నందిగం సురేష్‌ వెల్లడి

నిజంగా మీరు తప్పు చేయకపోతే.. ధైర్యంగా నిలబడొచ్చు కదా?

మూడ్రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు?

టీడీపీ స్క్రిప్ట్‌ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారా?

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన ఎంపీ సందిగం సురేష్‌

తాడేపల్లి: చంద్రబాబుతోనే  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి హాని ఉంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేష్ అనుమానం వ్య‌క్తం చేశారు. ఓటు అమ్ముకోమని అంబేడ్కర్‌ చెప్పారా? అని నిల‌దీశారు. శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవమ‌న్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. 

సవాల్‌ స్వీకరిస్తున్నా:
– ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గంలో ఏనాడూ ఎమ్మెల్యేగా ప్రవర్తించ లేదు.
– ఏరోజూ ఆమె ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండలేదు.
– మీకు రాజకీయాలు కొత్త కాబట్టి, తెలుసుకుంటారని ఇన్నాళ్లూ జగన్‌గారు ఉపేక్షించారు.
– గతంలో అమరావతి జేఏసీ గురించి మీరేం మాట్లాడారు? మీ గురించి వాళ్లు మాట్లాడింది ఒకసారి చెక్‌ చేసుకోండి.
– మీరు ఇవాళ పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లోనే మాట్లాడారు. అది స్పష్టంగా అర్ధమవుతోంది.
– మీరు క్రాస్‌ ఓటింగ్‌ చేయలేదని, ప్రమాణానికి సిద్ధమని సవాల్‌ కూడా చేశారు. 
– మీ సవాల్‌ నేను స్వీకరిస్తున్నా. మీరు అమ్ముడుపోయి ఓటు వేశారని నిరూపించడానికి నేను సిద్ధం.

పాము పడగ కింద ఉన్నారు:
– మీకు పొంచి ఉన్న ప్రమాదాన్ని మీరు పసి గట్టలేకపోతున్నారు.
– వైఎస్సార్సీపీ రౌడీలంటూ మాట్లాడుతున్నారు. మీకు ప్రాణహాని కూడా ఉందని ఆరోపిస్తున్నారు.
– కానీ మా వైపు నుంచి మీపై ఎలాంటి కక్ష సాధింపులు, పగలు, ప్రతీకారాలు ఉండబోవు. ఎందుకంటే అది మా పార్టీ నైజం కాదు. 
– వాస్తవానికి మీకు ఆ పార్టీ వైపు నుంచే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని మీరు గుర్తించాలి.
– చంద్రబాబునాయుడి నిజస్వరూపం గురించి మీకు తెలుసా? నీచ రాజకీయాలకు, దుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. 
– అందుకే టీడీపీ వారే మీకు హాని తలపెట్టి, మాపై రుద్దే అవకాశం ఉంది.
– టీడీపీ వాళ్లు నిన్నటి నుంచి దళిత మహిళ అంటూ.. ఏదో జరిగిపోతోంది అంటూ గోల చేస్తున్నారు.
– దళితులను మోసం చేయడం, వారిని సర్వ నాశనం చేయడంతో పాటు, చివరకు ఒక దళిత మహిళను వివస్త్రను చేసిన వ్యక్తి చంద్రబాబు.
– అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొండి. వాస్తవాలు ఇకనైనా తెలుసుకొండి.

‘మేకప్‌.. ప్యాకప్‌’. ఇది గుర్తుందా?:
– సీఎం  వైయస్‌ జగన్‌ పాలనలో దళితులకు ఎలాంటి మేలు జరుగుతోందన్నది.. వారితో పాటు, రాష్ట్ర ప్రజలంతా గమనిçస్తున్నారు.
– చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజైనా ఎస్సీలకు ప్రాధాన్యం కలిగిన మంత్రి పదవులు ఇచ్చారా?
– దళితులను హోం మంత్రిగా చేసిన పరిస్థితి చంద్రబాబు దగ్గర ఉందా?
– అమరావతిలో ఏదో అన్యాయం జరిగిపోయిందని.. ఇప్పుడు మాట్లాడుతున్నారు.
– మరోవైపు టీడీపీ కూడా దళితులు, మేలు అంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. 
– కానీ గతంలో మీరు అమరావతి ఆందోళన గురించి ఏమన్నారు? మిమ్మల్ని ఉద్దేశించి టీడీపీ వారు ఏమన్నారో గుర్తు చేసుకొండి.
– మీదంతా ‘మేకప్‌.. ప్యాకప్‌ అని, మీరెప్పుడూ బ్యూటీ పార్లర్లలో ఉంటారని టీడీపీ వారన్న మాటలు మీకసలు గుర్తున్నాయా?.

మోసం చేయాలని ఎలా అనిపించింది?:
– మీ స్వార్థం మీరు చూసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మీకు పార్టీని విమర్శించే నైతిక హక్కు ఏ మాత్రం లేదు.
– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా మహిళలను గౌరవిస్తుందే తప్ప.. వారిని ఎక్కడా కించ పర్చదు.
– జగన్‌గారు చాలా గొప్ప వ్యక్తి అని మీరే ప్రెస్‌ మీట్‌లో చెప్పారు. మరి  అలాంటి వ్యక్తికి మోసం చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది?.
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు 10 నిమిషాలు ముందు కూడా మీరు సీఎంగారిని కలిశారు.

టీడీపీ స్క్రిప్ట్‌ ఇచ్చాక మాట్లాడారా?:
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు క్రాస్‌ ఓటింగ్‌ చేయకపోతే, ఆ వెంటనే ఎందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? 
– తుళ్లూరులో కానీ, సచివాలయంలో కానీ మాట్లాడొచ్చు కదా?
– కానీ అలా చేయకుండా, నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోయి, మూడు రోజుల తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది..?
– టీడీపీ వారు స్క్రిప్ట్‌ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారా?.
– మీరు చేసిన తప్పును అమరావతికి రుద్దాల్సిన అవసరం లేదు.

రాజకీయంగా పతనం:
– మీరు రాజకీయంగా పతనమయ్యారు. రాజకీయాల్లో మీ జీవితానికి మీరే చరమగీతం పాడుకున్నారు.
– గతంలో చంద్రబాబును నమ్మి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారో చూడండి.
– ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు కూడా సరిగ్గా అక్కడే, అలాగే ఉంటారు.
– చంద్రబాబును నమ్మి జగన్‌ గారిని మోసం చేసిన కుటుంబాలు ఎక్కడున్నాయో చూస్తూనే ఉన్నాం కదా?

మీరేమైనా పుణ్యకార్యం చేశారా?:
– మీరేమైనా పుణ్యకార్యం చేశారా? మీరు చేసిన విలువల్లేని పనికి పార్టీ కార్యకర్తలు దాడి చేయకుండా ఉంటారా? వారికి కడుపు మంట ఉండదా?
– వారంతా జగన్‌గారిని నమ్మి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రజలూ ఆదరించారు. అందుకే 151 సీట్లు వచ్చాయి.
– ఈ పార్టీలో కార్యకర్తలకు ఎంతో గుర్తింపు. వారిదే ఈ పార్టీ. అందుకే కోప తాపాలుంటాయి. మీలాంటి వారు ఇలాంటి పనులు చేసినప్పుడు వాటిని చూపిస్తారు.
– మీరు జగన్‌గారికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటున్నారు. కానీ ఆయనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే మొనగాడు ఇంతవరకూ పుట్టలేదు.
– ఏ గిఫ్ట్‌ అయినా జగన్‌గారు ఇవ్వాల్సిందే. 

ఇన్నాళ్లూ ఓపిక పట్టాం. చూశాం:
– బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలో ఇలాంటి అవమానాలు జరుగుతాయని అనుకోలేదంటున్నారు.
– మరి అదే రాజ్యాంగంలో ఓటు అమ్ముకోకూడదు అని కూడా రాశారు కదా?. అది మీకు గుర్తు లేదా?.
– ఇన్నాళ్లు మీ తప్పులను క్షమించి మేమంతా ఓపిక పట్టాం. కానీ ఇప్పుడు మీరు మరీ పరాకాష్టకు చేరారు.
– ఇప్పుడు కూడా మీ సెటిల్‌మెంట్‌ ఎక్కడ జరిగిందో మాకు తెలియదా?. ఎవరు ఏం మాట్లాడారో తెలియదనుకుంటే పొరపాటే.
– మీరు కళ్లు మూసుకుని లోకమంతా కళ్లు మూసుకుంది అనుకోవద్దు.

చర్చకు రెడీ. నార్కొటెస్ట్‌కూ సిద్ధం:
– మీరంటున్న స్కామ్‌లు ఏమిటో చర్చకు సిద్ధమా?. ఏదైనా చర్చించడానికి మేము రెడీ.
– మీరేం తప్పులు చేయలేదని ప్రమాణం చేస్తానంటున్నారు కదా? సవాల్‌ కూడా చేశారు కదా? మీ సవాల్‌కు నేను రెడీ. రండి. నేనూ ప్రమాణం చేస్తా.
– మీరు వెళ్లిపోతూ దళిత మహిళకు అన్యాయం, రౌడీలు అంటూ మాట్లాడుతుంటే చూస్తూ ఉండలేం.
– టీడీపీకి కానీ, రాజధాని ప్రాంతంలో కానీ.. అందరికీ చెప్తున్నా. ఇసుక మాఫియా విషయంలో ఎప్పుడైనా చర్చకు రెడీ. చివరకు నార్కొటెస్ట్‌కు కూడా నేను సిద్ధం.

సజ్జలగారిపై నింద ఎందుకు?:
– మీరు ఒక మహిళ. మీ మీద గౌరవం ఉంటుంది.
– కానీ మీరు ఎవరి మీద పడితే వారి మీద నిందలు వేస్తే.. రియాక్షన్‌ కూడా ఉంటుంది.
– మీకు ప్రాణహాని ఉందని, మీరు రాష్ట్రానికి వస్తే, మీకు ఏదైనా జరిగితే అందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిదే బాధ్యత అని నిందిస్తున్నారు.
– మళ్లీ చెబుతున్నాం. మీకేదైనా ప్రమాదం పొంచి ఉందంటే.. అది కచ్చితంగా టీడీపీ వల్లనే. మా పార్టీ వల్ల కాదు.
– అందుకే నేను కూడా డీజీపీగారికి లేఖ రాస్తాను. మీకు పూర్తి భద్రత కల్పించమని కోరుతాను.
– ఎందుకంటే చంద్రబాబు నాటకాలు అందరికీ తెలుసు. మీకు హాని తలపెట్టి, మా పార్టీపై నెట్టే ప్రమాదం ఉంది.

తప్పుకు–కులానికి ఏం సంబంధం?
– క్రాస్‌ ఓటింగ్‌ చేసి ఎంతో తప్పు చేసిన మీరు, ఇవాళ కులం గురించి ప్రస్తావిస్తున్నారు. అసలు తప్పు పనికి, కులానికి ఏమిటి సంబంధం?.
– అమరావతిలో చంద్రబాబు చేసింది లాండ్‌ స్కామ్‌ అని మీకు గతంలో అనలేదా?. ఆ విషయం మర్చిపోయారా?.
– ఇప్పుడు మీరెళ్లి అదే టెంట్‌లో కూర్చుంటానంటున్నారు. వెళ్లండి. మాకేం అభ్యంతరం లేదు. దాని వల్ల పోయేదేం లేదు.
– అభివృద్ధి  వికేంద్రీకరణ విషయంలో జగన్‌గారి నిర్ణయమే మా నిర్ణయం
– పార్టీ లైన్‌ దాటి తప్పు చేసినప్పుడు తప్పకుండా చర్యలుంటాయి. కానీ మీరు దళిత కాబట్టి సస్పెండ్‌ చేశాం అంటున్నారు. మరి ముగ్గురు ఎవరు? దళితులు కాదే. అది మాట్లాడరేం?.
– అందుకే తప్పుడు పనికి, కులానికి సంబంధం ఉండదు. వ్యక్తిగత తప్పులేమైనా ఉంటే క్షమిస్తారు తప్ప, కన్నతల్లి వంటి పార్టీని మోసం చేస్తే ఎవర్నీ ఉపేక్షించేది ఉండబోదని ఎంపీ నందిగం సురేష్‌ స్పష్టం చేశారు.

Back to Top