పవన్ సీఎం అభ్యర్థి కాదు.. కాపు సోదరులు  గమనించాలి

రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఎంపీ మార్గాని భరత్ 

కుల‌గ‌ణ‌న‌తో  అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమానంగా అందించవచ్చు

టీడీపీ బీసీలకు ఎన్ని రాజ్యసభ సీట్లు ఇచ్చింది?

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  సినీ న‌టుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థేకాద‌ని,  కాపు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ విజ్ఞప్తి చేశారు.  కులగుణనకు సంబంధించి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలోనే నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు నుంచి అన్ని కులాల కుల సంఘాల దగ్గరనుంచి అభిప్రాయాలు సేకరించాం. ఈ సంద‌ర్భంగా మార్గాని భ‌ర‌త్ మాట్లాడుతూ..రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ కులగణన పూర్తిస్థాయిలో జరిగిన దాఖలు లేవు.. ప్రతి కులానికి ఎంత మంది జనాభా వున్నారు, అందరికీ ఫలాలు అందుతున్నాయా లేదా అన్న విషయం కులగణన ద్వారా తెలుసుకోవచ్చు.. అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు సమానంగా అందించవచ్చు. టీడీపీ నేత యనమల ఇతర నేతలు జయహో బీసీ పేరుతో సమావేశం పెట్టడం దారుణం అన్నారు.

పార్టీ పుట్టిన 40 ఏళ్ళలో టీడీపీ బీసీలకు ఎన్ని రాజ్యసభ సీట్లు ఇచ్చారు..? అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. రాజ్యసభ సీట్లను డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు.. బీసీ, ఎస్సీలను టీడీపీ చాలా చిన్న చూపు చూసింది.. వర్ల రామయ్య కు రాజ్యసభ సీటు ఇస్తామని అవహేళన చేశారు. చంద్రబాబు బీసీ పట్ల దారుణంగా వ్యవహరించారు.. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామన్నారు.. మత్స్యకారుల తోలు తీస్తామన్నారు అని గుర్తుచేశారు. రాజమండ్రి ఎంపీ స్థానం, రాజమండ్రి సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాలు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీల కేటాయించింది.. మీరు కేటాయించగలరా..? అని సవాల్‌ చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సీఎం వైయ‌స్ జగన్ బీసీలకు కేటాయిస్తారు.. మీరు ఆ పని చేయగలరా..? అని చాలెంజ్‌ చేశారు.

ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటారు.. కేబినెట్‌లో 67 శాతం మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు.. మీరేనాడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు ఎంపీ భరత్.. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు ఏనాడైనా అధ్యక్ష స్థానం బీసీలకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తండ్రి కొడుక్కి పట్టం కడతారు.. వారి సామాజిక వర్గమే ఆధిపత్యం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఐదు లక్షల కోట్లు డీబీటి, నాని డీబీటి లో సీఎం వైయ‌స్ జగన్ ప్రజలకు అందించారు.. క్షేత్రస్థాయిలో టీడీపీ – జనసేన బాహాబాహికి తలపడుతున్నారు.. ఈ రెండు పార్టీల భావజాలం ఏ మాత్రం కలవదు.. చంద్రబాబు పల్లకీలు మోయడానికి మాత్రమే పవన్ కల్యాణ్‌ ఉన్నార‌ని మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శించారు.

Back to Top