విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు జ‌గ‌న‌న్న గోరుముద్ద‌

ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి

తిరుపతి:  ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించేందుకు జ‌గ‌న‌న్న గోరుముద్ద ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి తెలిపారు.  చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో శనివారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో  మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల‌కు వ‌డ్డిస్తున్న  ఆహారాన్ని ఎంపీ ప‌రిశీలించారు. అనంత‌రం విద్యార్థుల తో కలసి భోజనం చేశారు.  విద్యార్థుల కు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ల‌క్ష్యంతో  స్వ‌యంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెనూ ను ప్రత్యేకంగా రూపొందించారన్నారు. వారం రోజులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం పెట్టిస్తున్నార‌ని చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top