వైయస్‌ఆర్ జిల్లా: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు పొందారు. వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ వైయస్‌ఆర్ ఘాట్‌లోని మహానేత పాదాల చెంత ఎన్నికల నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి ఎంపీ బల్లీ దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి వైయస్ఆర్‌సీపీ తరఫున గురుమూర్తిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. దీంతో ఇటీవల తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.