ఉల్లిపాయ‌లు కేజీ రూ.25కే అందిస్తున్నాం

దేశ వ్యాప్తంగా ఉల్లి స‌మ‌స్య ఉంది

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో ఉల్లి స‌మ‌స్య‌ను నియంత్రిస్తున్నాం

ప‌శు సంవ‌ర్ధ‌క‌, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌

అసెంబ్లీ: రాష్ట్రంలోని 101 రైతుబ‌జార్ల ద్వారా ఉల్లిపాయ‌లు కేజీ రూ.25కే విక్ర‌యాలు జ‌రుపుతున్నామ‌ని ప‌శుసంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి మార్కెట్ ఇంట్ర‌వెన్ష‌న్ ఫండ్ ద్వారా అధిక ధ‌ర‌ల‌కు ఉల్లిని కొనుగోలు చేసి రైతుబ‌జార్ల ద్వారా కిలో రూ.25కే అందిస్తున్నామ‌ని వివ‌రించారు. అసెంబ్లీలో మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ.. యావ‌త్ దేశం మొత్తం ఉల్లిపాయ‌ల‌ స‌మ‌స్య ఉంద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు కృషిచేశామ‌ని చెప్పారు.  

 

సెప్టెంబ‌ర్ నుంచి ఉల్లిధ‌ర క్ర‌మేపీ పెరుగుతూ వ‌స్తుంద‌ని, సెప్టెంబ‌ర్ అగ్రిమిష‌న్ స‌మీక్ష‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉల్లి ల‌భ్య‌త‌, ధ‌ర‌ల‌పై చ‌ర్చించి.. భ‌విష్య‌త్తులో ఉల్లిధ‌ర పెరిగే అవ‌కాశం ఉంద‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించార‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు సెప్టెంబ‌ర్ 27 నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు మొద‌టి విడ‌త‌లో మార్కెట్ ఇంట్ర‌వెన్ష‌న్ ఫండ్ ద్వారా ఉల్లిపాయ‌లు కేజీ రూ.25కే విక్ర‌యాలు జ‌రిపామ‌న్నారు. సెప్టెంబ‌ర్ 27 నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు 6731 క్వింటాళ్ల‌ను కొనుగోలు చేసి వినియోగ‌దారుల‌కు స‌ర‌ఫ‌రా చేశామ‌ని వివ‌రించారు. మ‌ధ్య‌లో కొన్ని రోజులు ఉల్లి ధ‌ర‌లు అదుపులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ న‌వంబ‌ర్ 14 నుంచి ఉల్లి ధ‌ర‌లు పెరుగుతూనే వ‌చ్చాయ‌ని, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యం మేర‌కు రాష్ట్రంలో, ఉల్లి పంట అధికంగా వ‌చ్చే ఇత‌ర దేశాల ప్రాంతాల నుంచి అధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి నేటి వ‌ర‌కు సుమారు 38 వేల క్వింటాళ్ల ఉల్లిపాయ‌ల‌ను రూ.25కే రాష్ట్రం ఉన్న101రైతు బ‌జార్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. ఉల్లి ధ‌ర‌లు, స‌ర‌ఫ‌రాల విష‌య‌మై ఈ రెండు మాసాల్లో మార్కెటింగ్ శాఖ‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాలుగు ప‌ర్యాయాలు స‌మీక్ష‌లు జ‌రిపార‌న్నారు. 

 

డిసెంబ‌ర్ 5వ తేదీన అత్య‌ధిక‌మైన ధ‌ర కేజీ రూ.120 బ‌య‌ట మార్కెట్ల‌లో కొనుగోలు చేసి రైతుబ‌జార్ల‌లో వినియోగ‌దారుల‌కు కేజీ రూ.25కే అందించామ‌న్నారు. దేశం మొత్తం మీద అధిక వ‌ర్షాలు ప‌డ‌డం ఉల్లిపంట పూర్తిగా దెబ్బ‌తిన‌డం,  ఈ ఏడాది ఉల్లి పంట విస్తీర్ణం త‌క్కువ‌గా ఉండ‌డంతో ఈ స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని చెప్పారు. గ‌తంలో ఎన్న‌డూ లేని వి వేయ‌డం వ‌ల్ల ఈ త‌రుణంలో దేశ మొత్తం మీద అనూహ్యంగా ఉల్లిధ‌ర‌లు పెరిగాయి. 

Read Also: వైయస్‌ఆర్‌సీపీది రైతు ప్రభుత్వం

Back to Top