గాల్లో దీపంలా ఏపీలో మహిళల భద్రత

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆందోళన

రోజురోజుకీ దిగజారుతున్న శాంతి భద్రతలు 

ఆడబిడ్డలపై నిత్యం 49 అఘాయిత్యాలు 

5 నెలల కూటమి పాలనలో మహిళలకు చీకటి రోజులే

అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి ప్రకటనతో స్పష్టమైంది

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం

రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుకే పోలీసుల ప్రాధాన్యత

ఇప్పటికైనా దిశ యాప్‌ను పునరుద్ధరించాలి

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి స్పష్టీకరణ

రుషికొండపై అత్యున్నత ప్రమాణాలతో భవనాలు

మీకు చేతనైతే ఆ నిర్మాణాలను అభినందించాలి

చంద్రబాబులా నాసిరకం తాత్కాలిక భవనాలు కట్టలేదు

సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టుల్లో కనీస వసతులు లేవు

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన వరుదు కళ్యాణి

తాడేపల్లి: ఏపీలో ఆడపిల్లల భద్రత గాల్లో దీపంలా మారిందని, పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఆడబిడ్డలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి నెలకొందని చెబుతూనే ఉన్నాం. కానీ భద్రత కల్పించడానికి మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు రావడం లేద‌ని ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి మండిప‌డ్డారు.  తాజాగా హోం మంత్రి నివాసం ఉంటున్న విశాఖలో ఓ మహిళా లా స్టూడెంట్‌పై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

–  వైయస్ఆర్‌సీపీ  హయాంలో తీసుకొచ్చన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు. దిశ యాప్‌ను కొనసాగిస్తే.. జగన్‌గారికి మంచి పేరొస్తుందనే భయంతో, సీఎం చంద్రబాబు ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేశారు. 
– శాంతి భద్రతల కోసం పని చేయాల్సిన పోలీస్‌ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. 

ప్రభుత్వం అంగీకరించింది:
– ఆడబిడ్డలపై నేరాలు ఈ రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయని అసెంబ్లీలో స్వయంగా హోం మంత్రి అంగీకరించారు. రోజూ 49 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నారంటే, ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్తితులు నెలకొన్నాయో తెలుస్తోంది. 

మచ్చుకు కొన్ని ఘటనలు:
– ఐదు రోజుల క్రితం పెదగంట్యాడలో ఓ ప్రేమోన్మాది ఒక అమ్మాయి మీద దాడి చేస్తే ఆ నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. 
– ముచ్చుమర్రి కేసులో చిన్నారిని చంపి ముక్కలుగా నరికేసిన నిందితులు బెయిల్‌ తీసుకుని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇప్పటికీ చిన్నారి మృతదేహాన్ని మాత్రం పోలీసులు కనుగోనలేకపోయారు.
– హిందూపూర్‌లో అత్తాకోడళ్లపై వారింటికే వెళ్లి అత్యాచారం చేశారంటే భద్రత ఎంత కడు దయనీయంగా ఉన్నాయో తెలుస్తోంది. 
– రాంబిల్లి ఘటనలో సురేష్‌ అనే వ్యక్తి మహిళను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనకు ముందే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతోనే చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 
– ఇటీవల విశాఖ పెదగంట్యాడ ఘటనలోనూ ఇదే పరిస్ధితి. నిందితుడి గురించి బాధితురాలి కుటుంబం ప్రేమోన్మాది నీరజ్‌ శర్మ గురించి పోలీసులకు రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే నిందితుడు బరితెగించాడు 
– తెనాలిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన బాలిక విషయంలోనూ నవీన్‌ అనే వ్యక్తి రెచ్చిపోయాడు. 
– బద్వేలులో బాలికపై పెట్రోల్‌ పోసి కాల్చి చంపేశాడు. బాపట్లలో వృద్ధుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు. 
– గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ధర్నా చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా అనిపించలేదు. 

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు:
– వరుసగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా దిశ యాప్‌ను ఎందుకు నిర్వీర్యం చేశారు?. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న దిశ చట్టాన్ని ఆమోదింపజేయడం కోసం మీరు ఎందుకు ప్రయత్నించడం లేదు?.
– మీ సపోర్టుతోనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి కొనసాగుతున్నా, మీరు ఎందుకు డిమాండ్‌ చేయలేక పోతున్నారు?. 

అదే  వైయస్ఆర్‌సీపీ  ప్రభుత్వ హయాంలో..:
–   వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రత కోసం పోక్సో కోర్టులు, మహిళా కోర్టులు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం.
– ఇంకా మహిళా పోలీస్‌లు, మహిళా పోలీస్‌స్టేషన్లు, మహిళలపై నేరం జరిగినప్పుడు తక్షణం స్పందించేలా 900కు పైగా టూ వీలర్లు, 160కి పైగా ఫోర్‌ వీలర్లు ఏర్పాటు చేశాం.

ఇకనైనా వైఖరి మార్చుకొండి:
– మహిళల రక్షణకు అన్ని వసతులు కల్పించిన మా ప్రభుత్వ స్ఫూర్తితో ఇప్పటికైనా మహిళల భద్రత కోసం ముందడుగు వేయండి. 
– పోలీస్‌ వ్యవస్థలను రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుకు, కక్షపూరిత రాజకీయాలకు కాకుండా మహిళలు, శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించాలి. 
– ఈ కూటమి ప్రభుత్వంలో చివరకు పోలీస్‌ కుటుంబాలకే రక్షణ లేకుండా పోయింది.« ధర్మవరం సీఐం తల్లిని ఎత్తుకుపోయి దారుణంగా హతమార్చారు.

రుషికొండపై అధ్బుత నిర్మాణాలు:
– రుషికొండ భవనాల విషయంలో దారుణమైన అబద్ధాలు చెప్పిన కూటమి నాయకుల మాటలన్నీ అబద్ధాలని, మండలి సాక్షిగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాటలు స్పష్టం చేస్తున్నాయి. 
– జీవీఎంసీ, సీఆర్‌జెడ్‌ నుంచి అన్ని అనుమతులు పొందాకే అక్కడ భవనాలు నిర్మించారని స్వయంగా మంత్రి ప్రకటించారు.
– దీంతో ఏ అనుమతులు లేవని గతంలో ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారం మొత్తం అబద్ధమని తేలిపోయింది. 
– ఇదే చంద్రబాబు గతంలో సీఎంగా ఉండి చదరపు అడుగు రూ. 12 వేలతో నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లో కనీసం మహిళలకు బాత్రూంలు కూడా లేవు.
– వర్షం కురిస్తే, నీరు కారుతోంది. అంత నాసిరకంగా వాటిని నిర్మించారు. 
– అదే రుషికొండపై జగన్‌గారు, టూరిజం భవనాలను అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రం గర్వపడేలా నిర్మించారు. 
– అందుకని ఇప్పుడైనా ఆ భవనాలపై తప్పుడు ప్రచారం ఆపాలి. మీకెలాగూ ఇంత అద్భుతంగా నిర్మించే సత్తా లేదని గ్రహించాలి. చేతనైతే ఆ నిర్మాణాలను అభినందించాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు.

Back to Top