ప్ర‌భుత్వం ఎలా న‌డ‌పాలో చంద్ర‌బాబు చెప్ప‌డం హాస్యాస్ప‌దం

ఎమ్మెల్సీ సీ.రామ‌చంద్ర‌య్య‌
 

వైయ‌స్ఆర్ జిల్లా:  ప్ర‌భుత్వం ఎలా న‌డ‌పాలో చంద్ర‌బాబు చెప్ప‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్సీ సీ.రామ‌చంద్ర‌య్య పేర్కొన్నారు. గ‌త ఐదేళ్లు ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డంలో విఫ‌ల‌మైన చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం చేసిన విష‌యం గుర్తించుకోవాల‌న్నారు.  చంద్ర‌బాబు ద్వంద్వ ప్ర‌మాణాలు, మొస‌లి క‌న్నీళ్లు ప్ర‌జ‌ల‌కు తెలుసు అన్నారు. క‌రోనాపై భ‌యాందోళ‌న‌లు క‌లిగించ‌డ‌మే చంద్ర‌బాబు ఎజెండా అని విమ‌ర్శించారు. క‌రోనాకు భ‌య‌ప‌డి ప‌క్క రాష్ట్రంలో దాక్కున్న చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

తాజా వీడియోలు

Back to Top