బైరవానితిప్ప ప్రాజెక్టు సీఎం జగన్‌ పూర్తిచేస్తారు

కల్యాణదుర్గం చెరువులను నీటితో నింపండి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌

 

అసెంబ్లీ: బైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తిచేసి కల్యాణదుర్గంలోని 114 చెరువులను నీటితో నింపాలని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు పూర్తి చేసి కల్యాణదుర్గంలోని వలసలు, పేదరికం, నిరుద్యోగాన్ని అరికట్టాలన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘బైరవానితిప్ప ప్రాజెక్టు కల్యాణదుర్గానికి జీవవాయువు. అనంతపురంలో హార్టికల్చర్‌ హబ్‌ అని పేర్కొంటున్నారు. దానికి మేజర్‌ కాంట్రీబ్యూషన్‌ కూడా కల్యాణదుర్గం. నియోజకవర్గంలో పండే కలంగిరి, కర్బూజకు ఢిల్లీ న్యూ ఆజాద్‌పురం మార్కెట్‌లో ఈ రోజుకు మంచి డిమాండ్‌ ఉంది. కల్యాణదుర్గంలో పండే టమాటకు సీఎంఆర్, ఎస్‌కేఎస్‌ మండిలో ఈ రోజుకు డిమాండ్‌ ఉంది. కళ్యాణదుర్గంలో ఉండే 114 చెరువులకు బైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వాలి. మన రైతులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.. ఇంటర్నేషనల్‌ హార్టికల్చర్‌ పోటీ పడుతామని చాలా బలంగా నమ్ముతున్నాను. అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్కరూ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా లబ్ధిపొందుతున్నారు. జీడిపల్లి ప్రాజెక్టు కల్యాణదుర్గం నుంచి పది కిలోమీటర్ల దూరం ఉన్నా.. ఒక చుక్క నీరు రావడం లేదు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలను ఆదుకుంటారని బలంగా నమ్ముతున్నానని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top