ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్‌ తప్పనిసరి

ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌
 

అసెంబ్లీ: ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యార్థులకు ఇంగ్లీష్‌ విద్య తప్పనిసరి అని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ ప్రతి దాంట్లో కూడా తప్పనిసరి అయ్యింది. ప్రైవేట్ సెక్టార్‌ పబ్లిక్ సెక్టార్‌ను డ్యామినేట్‌ చేస్తోంది. అందుకోసమే ఇంగ్లీష్‌ అవసరం తప్పనిసరి. మన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఇంగ్లీష్‌ అవసరం. మన ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. సిలబస్‌ కూడా మార్పు చేయబోతున్నాం. ఒత్తిడి లేకుండా విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ఇస్తున్నాం. టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో విద్యా విప్లవం తీసుకువచ్చారు. అమ్మ ఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం అమలు చారిత్రాత్మకం. ఈ రోజు కౌన్సిల్లో ఈ బిల్లు రిజెక్టు అయ్యిందంటే..వాళ్ల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం కావాలి..పేద వాళ్లకు వద్దా ? ఇదేక్కడి న్యాయం. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.
 

తాజా వీడియోలు

Back to Top