నీ స్థాయికి మించిన మాటలెందుకు లోకేష్‌

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి కౌంట‌ర్‌

అనంత‌పురం:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన ఆరోప‌ణ‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి తిప్పికొట్టారు.  నీ స్థాయికి మించిన మాట‌లెందుకు అంటూ ప్ర‌కాశ్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. 

  • ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పదేళ్ల రాజధాని హక్కును వదిలేసి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది ఎవరు.?
  • కడప ఉక్కు పరిశ్రమని అడ్డుకున్నది ఎవరు.? కృష్ణా జలాలు రాయలసీమకు వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరు.? 
  • నేనూ సీమ బిడ్డనే అని చెప్పుకుంటూనే 14 ఏళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులను పట్టించుకోనిది ఎవరు.?
  • ఎన్డీయేలో ఉంటూ ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని కూసింది ఎవరు.? 
  • తరువాత అదే బీజేపీ అన్యాయం చేసింది అంటూ ధర్మపోరాట దీక్షలు చేసిందెవరు.? 
  • అన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఇలా ప్రశ్నిస్తే ఎలా.? 
  • నీకు బుద్ధి, జ్ఞానం ఉంటే అవే ప్రశ్నలు మీ నాన్న చంద్ర‌బాబును అడుగు.. సమాధానాలు రాబట్టు పప్పు అంటూ తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి రీ ట్వీట్ చేశారు. 
Back to Top