అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాం

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి  

 సుప్రీం కోర్టులో ఎస్ఎల్ పీ వేస్తాం..
 
అప్పర్ భద్రకు అనుమతుల ఇస్తుంటే చంద్రబాబు నోరెత్తలేదు
 
బాబు లోపాయికారి ఒప్పందంతోనే రాష్ట్రానికి తీరని నష్టం
 
ఈ పాపానికి చంద్రబాబును ఉరితీయాలా..? జైల్లో పెట్టాలా..?
 
మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి  

అనంత‌పురం: అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తామ‌ని  రాప్తాడు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి  పేర్కొన్నారు. అనంతపురం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు హాయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ఆ చేదుగుళికలు ఇప్పటికీ మనం అనుభవించాల్సి వస్తోంది. కర్నాటకలో దేవేగౌడ ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు ఏఐబీపీ నిధులను కర్నాటకకు తరలించారు. అప్పుడే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల అల్ మట్టి ఎత్తు పెంచారు. పొరుగు రాష్ట్రాలకు మన హక్కులను తాకట్టు పెట్టినందుకు...  కర్ణాటక కాటన్ దొరగా చంద్రబాబును అభివర్ణించాలి. తన మనసులో మాట పుస్తకంలో కూడా వ్యవసాయంపై పెట్టుబడి దండుగ అన్న మాట చంద్రబాబు మనసులో నుంచి వచ్చిందని అందరికీ తెలుసు. అప్పట్లో ఎగువన ఉన్న కర్ణాటక ఇరిగేషన్ పై ఉదాహరణకు 100 రూపాయలు ఖర్చు పెడితే.. చంద్రబాబు 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. చంద్రబాబు హయాంలో కర్నాటకలో అనేక అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టారు..అప్పుడు చంద్రబాబు నోరెత్తలేదు. కర్నాటక చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది. దీనిపై మేం అనేక సార్లు, అనేక వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్రం ఆమోదం తెలిపింది. అందుకే కృష్ణా జలాల్లో ఏపీ వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.  చంద్రబాబు హయాంలో అప్పర్ భద్రకు అన్ని అనుమతులు వస్తున్నా మాట్లాడలేదు
- పట్టిసీమ లిఫ్ట్ పెట్టి,  గోదావరి జలాల డైవర్షన్‌ వల్ల కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి సాగునీటి హక్కు వస్తుందని కర్నాటక వాదిస్తోంది.  ఆ నీటిని అప్పర్‌ భద్ర ప్రాజెక్టులో వినియోగించుకోవడానికి కర్నాటక కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది.  కేంద్రం కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ముందుకు కదులుతోంది.  వీటికి తోడు తుంగ, భద్ర కాల్వల అధునికీకరణ ద్వారా కూడా కొంత మేర కృష్ణా జలాలను తీసుకుంటోంది.  దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాలను కూడా కర్నాటక కనీసం సంప్రదించలేదు. కృష్ణా జలాల కేటాయింపుపై సుప్రీం కోర్టులో స్టే ఉన్నా లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది

చంద్రబాబు లోపాయికారి ఒప్పందం వల్లే ఈ నష్టం:
- ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా లక్ష కోట్లతో.. కోటి ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో జలయజ్ఞాన్ని ప్రారంభించిన మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు. 
- వ్యవసాయాన్ని పండుగలా చేయాలని రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టులు కట్టారు. అదే,  చంద్రబాబు హయాంలో కర్నాటక ప్రభుత్వం ఘటప్రభ, మలప్రభ వంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది.  వీటితో పాటు తుంగభద్ర ఆధునికీకరణ చేపట్టింది. ఏ నాడూ వాటిపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయలేదు
- అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు 2017లో ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ వచ్చింది..విస్తరణకు అనుమతులు పొందింది.  చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు కనీసం అభ్యంతరం కూడా తెలుపలేదు
- మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికున్నంత వరకూ దానికి అనుమతులు రాలేదు.  ఈ రోజుకు కూడా దానికి నీటి కేటాయింపులు లేవు
- పోలవరాన్ని కూడా చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడు..ఎక్కడా నీటి మళ్లింపు జరగకముందే కర్నాటక తన వాటాను అప్పర్‌ భద్ర కోసం వాడుకుంటాను అంటోంది
- చంద్రబాబు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కి మళ్లించానని చెప్పిన నేపథ్యంలోనే అప్పర్‌ భద్ర పాజెక్టుకు ఆ నీరు వినియోగించుకుంటామని వారు అన్నారు
- ఇప్పటి వరకూ పోలవరం పూర్తి కాకపోయినా దాని డైవర్షన్‌ ద్వారా రావాల్సిన నీటిని కర్నాటక తనకు హక్కు వచ్చిందని వాదిస్తోంది
- కేటాయింపులు లేనటువంటి నీటిని మాకు హక్కు ఉందని వాదిస్తోంది

మేం వచ్చాకే పోరాటం...అప్పర్‌భద్రను అడ్డుకుని తీరతాం:
- మేం వచ్చిన తర్వాత 2019 నుంచి అప్పర్ భద్ర కు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాం
- అయినా సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసింది
- దానిపై సుంప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్ పీ వేస్తుంది.
- ఈ అంశంపై మేం సీడబ్ల్యూసీ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాం
- ఇన్ని లొసుగులు ఉన్నా రాష్ట్ర అభ్యంతరాలు చెప్పినా కర్నాటక ఆ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తోంది

కర్నాటకవన్నీ కాకిలెక్కలే..
- కాకిలెక్కలతో కర్నాటక ప్రభుత్వం అప్పర్‌ భ్రద డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది
- దీనిపై తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తాం..అప్పర్‌ భద్రను అడ్డుకుంటాం
- ఎక్కడా అప్పర్‌ భద్రకు నీటి కేటాయింపులు లేవు...ఇంకా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు
- గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ఇంకా పూర్తి కాలేదు.
- అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పోరాటం చేస్తుంది

ఈ పాపానికి చంద్రబాబును ఉరితీయాలా..? జైల్లో పెట్టాలా..?:
- చంద్రబాబు హాయాంలో లోపాయికారి ఒప్పందాల ద్వారా ఆనాడు అనేక అనుమతులు కర్ణాటక తెచ్చుకుంది
- చంద్రబాబు నిరాసక్తత వల్ల కర్ణాటక అనేక ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగింది
- ఈ పాపానికి చంద్రబాబును ఉరితీయాలా..? జైల్లో పెట్టాలా..?
- విభజన చట్టం ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది
- గతంలో డాక్టర్‌ వైఎస్సార్‌ గారు జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు చేపట్టటం వల్లే  ప్రాజెక్టులు పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. 
- తెలంగాణాలోనూ రాజశేఖరరెడ్డిగారు చేపట్టిన ప్రాజెక్టులు వల్లే విభజన తర్వాత కీలక ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగారు.
- కర్ణాటక దూకుడు వ్యవహార శైలిపట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాం
- తప్పనిసరిగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టును అడ్డుకుంటాం
- సుప్రీం కోర్టులో మా వాదన వినిపిస్తాం...అప్పర్‌ భద్ర పై న్యాయ పోరాటం చేస్తాం

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top