రాజధాని ప్రాంతంలో అంటరానితనం

అమరావతి భ్రమరావతిగా మిలిగిపోయింది

రోడ్లు, సమాధులు, శ్మశానాలను టీడీపీ కార్యకర్తలు ఆక్రమించారు

ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు నిలువునా ముంచేశారు?

ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

అసెంబ్లీ: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పిన చంద్రబాబు..అందులో దళితులు, ఎస్సీలు, ఎస్టీలకు స్థానం లేకుండా చేశారని, అంటరానితనం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. అమరావతి భ్రమరావతిగా మిలిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.. రాజధాని పేరుతో జరిగిన కుంభకోణంపై ఇదే సరైన సమయంగా భావించి మాట్లాడుతున్నాను. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో, మనకు ఒక రాజధాని ఉండాలని, అందులో అందరికి స్థానం ఉండాలని సామాన్యులు, దళితులు, మైనారిటీలు భావించారు. అత్యంత బాధకరమైన సందర్భంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు, కొత్తగా నిర్మించుకోబోయే రాజధానిలో  జనాభా నిష్పత్తి ప్రకారం మాకు స్థానం ఉంటుందని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు భావించారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు తాను మారానని, కొత్తగా చూస్తారని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. తాను మాత్రమే రాజధాని కట్టగలను, సుదీర్ఘమైన అనుభవం ఉందన్నారు. ఆయన హామీలను నమ్మిన ప్రజానీకం 1.5 శాతంతో అధికారం ఇచ్చారు. చంద్రబాబు నిర్మించబోయే అమరావతి నగరం..భ్రమరావతిగా మిగిలిపోతుందని ఎవరూ ఊహించలేదు. అంచలంచలుగా, సమాయానుకులంగా, మాయమాటలతో గ్రాఫిక్స్‌ మాయాజాలంతో , ప్రచార ఆర్భాటాలతో తప్పుదోవ పట్టించారు. రాజధాని ప్రాంతంలోని రైతులను నమ్మించి 33 వేల ఎకరాల సాగు భూమితీసుకున్నారు. మాకు స్థానం ఉంటుందనుకున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఇది ఒక గేటేడ్‌ కమ్యూనిటీగా మారింది. ఈ రాజధానిలో ఒక సెంట్‌ భూమి కొనాలంటే ఊహకు అందని స్థాయిలోకి తీసుకెళ్లారు. వినే నాయకుడు..నేనున్నానని చెప్పే నాయకుడు..చేస్తానని చెప్పి తప్పనిసరిగా చేసే నాయకుడు  ఈ సభకు నాయకత్వం వహించే శుభతరుణంలో మాకు జరిగిన అన్యాయాలు, పదే పదే హింసించిన కోణాలను సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మనం నివసించే వ్యవసాయ ఆధారిత ప్రాంతం, కరకట్ట ఉంది. అవతల నది ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారు దళితులు, బలహీన వర్గాలు, మాల, మాదిగలు ఉన్నాయి. వారి వద్ద కూడా భూములు ఉన్నాయి. అవి అసైన్డ్‌ భూములు, నదీ పరివాహక భూములుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో జరిగిన ప్లాట్ల కేటాయింపుల్లో దారుణాలు జరిగాయి. సామాజిక కోణంలో నిండుసభలో హృదయపూర్వకంగా అడుగుతున్నాం. ఎస్సీలకు సంబంధించిన భూముల ధరలను ఎందుకు తగ్గించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. అసైన్డ్‌ భూములకు వంద గజాలు వాణిజ్యానికి, 800 గజాలు ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. రిజిస్ట్రర్డ్‌, పట్టా భూములు, వెబ్‌ల్యాండ్‌ భూములకు ఇళ్ల స్థలాలకు వేయ్యి గజాలు, 250 గజాలు పట్టా భూములకు, 450 గజాలు వెబ్‌ల్యాండ్‌ రైతులకు ఇచ్చారు. మాకేందుకు అంత స్థలం ఇవ్వలేదు. చంద్రబాబు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో అంటరానితనం జరిగింది. భూ కేటాయింపుల్లో ఎక్కడ కేటాయించారు. ఎస్సీలకు ఒకచోట, బీసీలకు మరో చోట, కొన్ని కులాలకు ఇంకోచోట కేటాయించారు. చంద్రబాబు ఒంటినిండా కుళ్లు కుతంత్రాలు ఉన్నాయి. అంటరానితనం ఉంది. రికార్డుల్లో పరిశీలిస్తే అంటరానితనం వెలుగులోకి వస్తుంది. ప్రపంచాన్ని తలదన్నే రాజధాని కడతా అన్నారు. ఇక్కడ కుల వివక్ష జరిగింది. సీఆర్‌డీఏ పరిధిలో 20 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే వైయస్‌ఆర్‌సీపీ 17 స్థానాల్లో, టీడీపీ మూడు స్థానాల్లో గెలిచింది. మంగళగిరి, తాడేకొండ స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలిచింది. మీరు కట్టించిన ప్రపంచ స్థాయి రాజధానిలో ఎందుకు 144 సెక్షన్లు విధించారో సభకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఢిల్లీ నుంచి, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రతినిధులను పిలిచి రాజధానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఇప్పుడు పిచ్చి మొక్కలు పెరిగాయి. శంకుస్థాపనకు రూ.3200 కోట్లు ఖర్చు చేశారు. రాజధానికి రావడానికి కనీసం నాలుగు అడుగుల విస్తీర్ణం గల రోడ్డు ఉందా? లేదు..ఆయన చెబుతున్నారు..ప్రపంచ స్థాయి రాజధాని కట్టానని చెబుతారు. టీడీపీ కార్యకర్తలు ఊర్లపై పడి రోడ్లు, శ్మశానాలు, చెరువులు, కుంటలు, బావులు ఆక్రమించుకున్నారు. అడ్డుగా ఉన్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులను జైళ్లలో పెట్టించారు. ఇదే రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని పాలెంలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్‌ను ఆ రోజు పొలాలను తగులగొట్టారని స్టేషన్‌కు తీసుకెళ్లి అవమానించారు. ఆ సురేష్‌ను మా నాయకుడు వైయస్‌ జగన్‌ ఈ రోజు ఢిల్లీలో కూర్చోబెట్టారు. మీరు దళిత వ్యతిరేక వాది అని అందరికి తెలుసు. ఇది ప్రజా రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. ఈ రాజధానిలో మాకు స్థానం ఎక్కడ ఉంది?. రాజధానికి 33 వేల ఎకరాల భూమిని తీసుకున్నారు. ఈ రాజధానిలో రైతు కూలీ ఉన్నాడు. ఆ రైతు కూలీ 31 లక్షల పని దినాలు కోల్పోయాడు.  ఐదేళ్ల పాటు ఒక ఓటి 60 లక్షల పని దినాలు కొల్పోతే..రోజుకు రూ.500 సంపాదిస్తారు. సుమారు రూ.825 కోట్లు రైతు కూలీలకు జరిగిన నష్టం. ఈ కూలీలంతా మాలలు, మాదిగలు, ఎరుకలి, యానాదిలే. వారంతా మోసపోయి ఇళ్లలో కూర్చున్నారు. రైతు కూలీలకు స్కీల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారు. తాత్కాలిక భవనాల నిర్మాణాలకు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి కూలీలను తెచ్చుకున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న సామాన్యుల ఆవేదన...భావోద్వేగం అని గుర్తించాలి. మీరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవాలంటే మీ సంస్థల ద్వారా చేసుకోవాలని కానీ, ప్రజలకు సంబంధించిన రాజధానిలో కాదు. ఇప్పుడైతే పరిపాలించేవారు మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు న్యాయం చేస్తారని పరిపూర్ణమైన నమ్మకం ఉంది. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చెప్పిన 150 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏమైంది?. ఈ రోజు వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజధానిలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు స్థానం కల్పించాలని కోరుతున్నాను. 

 

Back to Top