గాజువాక‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం

ఇంటింటా ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి

విశాఖ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నారు. గాజువాక నియోజకవర్గం 73వ వార్డు సీడ‌బ్ల్యూసీ బిల్డింగ్ సచివాలయం పరిధిలో 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత‌ఆధ్వర్యంలో  గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ప‌ర్య‌టించారు. వారు ప్రతి ఇంటికి వెళ్లి  ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్దిదారులకు వివరిస్తూ ప్రజల  సమస్యలను తెలుసుకోని అధికారులకు వెంటనే సమస్య పరిష్కరించమని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు గొరుసు సత్యం, జి.సత్యనారాయణ, వివిరావు, వివి నాయుడు, అలీ, కిరణ్,కమల్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top