పేదవాడి సొంతింటి కల సీఎం వైయస్‌ జగన్‌తో సాధ్యం

హౌసింగ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి

అమరావతి: పేదవాడికి సొంత ఇల్లు కల అని, అది కలలాగా మిగిలిపోకూడదు, సహకారం చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అన్నారు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రూ. 8615 కోట్లతో హౌసింగ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికలు ముగిసిన తరువాత పేదవారికి పార్టీలకు అంటించవద్దని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఇచ్చే 25 లక్షల ఇళ్లను పార్టీ, కులం, మతం, వర్గం తేడా లేకుండా అందజేస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు ఇళ్లు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రివర్స్‌టెండరింగ్‌ ప్రక్రియను తీసుకువచ్చి అవనీతి రహిత పాలన అందించాలని అడుగులు వేస్తున్నారని వివరించారు. ఇళ్లు కట్టించడమే కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం వస్తే ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టుపెట్టుకొని పావలా వడ్డీకే రుణం పొందవచ్చని సీఎం చెప్పారన్నారు. 

నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా గనులు ఉన్నాయని, బేతంచర్ల వద్ద కూడా చాలా క్వారీలు మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయని, హౌసింగ్‌కు క్వారీల నుంచి స్టోన్‌ వాడుకుంటే బాగుంటుందని శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. పేదవాడికి సొంతింటి కలను సహకారం చేస్తున్నందుకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

 

తాజా ఫోటోలు

Back to Top