ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు

చంద్రబాబు కనుసన్నల్లో ఎన్నికల కమిషనర్‌ పని చేస్తున్నారు

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట

 ఎన్నికల్లో ఏకగ్రీవాలు అయితే చంద్రబాబుకు వచ్చిన కష్టమేంటి?

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరిని అడిగి వాయిదా వేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారు. కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయడం సరైంది కాదన్నారు. సకాలంలో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్ల నిధులు ఆగిపోతాయన్నారు. చంద్రబాబు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ఆయన 14 ఏళ్లు సీఎంగా పని చేస్తే  ఒక్కసారి మాత్రమే ఎన్నికలు పెట్టారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే జీర్ణించుకోలేక వాయిదా వేశారన్నారు. శ్రీకాకుళంలో అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌పై రాష్ట్రంలో ఎవరితో ఎన్నికల కమిషన్‌ చర్చింది? ఎవరితోనూ చర్చించకుండా ఎన్నికలు వాయిదా వేయడం ఎంతవరకు సమంజసం. వాయిదా వేసిన తరువాత అధికారులపై చర్యలు తీసుకోవడం ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. కేవలం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇందులో కుట్ర దాగి ఉంది. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికలు జరగవని చెబుతున్నారు. ఎన్నికలు ఆగిపోతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.ఎన్నికలంటే వారికి ఇష్టం లేదు. ఎప్పుడో జనవరిలో జరగాల్సిన ఎన్నికలను నిలిపివేశారు. కోర్టుల్లో కేసులు వేశారు. రిజర్వేషన్లపై మోకాలడ్డారు. ఇప్పుడు నేరుగా ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలపై నమ్మకం లేదు. ఆయన 14 ఏళ్లు సీఎంగా పని చేస్తే..చంద్రబాబు హయాంలో కేవలం ఒక్కసారి  ఎన్నికలు నిర్వహించారు. 2018లో ఎన్నికలు పెట్టలేదు.  జన్మభూమి కమిటీలు వేసి స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఆయనకు నమ్మకం లేదు. ఆయన కనుసన్నల్లో ఎన్నికల కమిషనర్‌ పని చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎకనామిక్‌ డైరెక్టర్‌గా కమిషనర్‌ కూతురు పని చేసింది. అందుకే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి ఈ విచక్షణాధికారం. ఈ అధికారం ఎవరిచ్చారు. చంద్రబాబు ఇచ్చారా? మొన్న శాసన మండలిలో కూడా చైర్మన్‌ ఇలాంటి విచాక్షణాధికారాన్ని ఉపయోగించి బిల్లులు అడ్డుకున్నారు. మార్చిలోగా ఎన్నికలు జరగకపోతే సుమారు రూ.5 వేల కోట్లు ఆగిపోతాయి. రాష్ట్ర ఖజానాను చంద్రబాబు నాశనం చేశారు. ఇప్పుడు నిధులు రాకుండా అడ్డుకొని రాక్షస ఆనందంలో ఉన్నారు. వైయస్‌ జగన్‌ చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తూ..రాష్ట్ర ఖజానాను గాడిలో పెడుతూ..అబివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చూస్తూ బ్రహ్మండమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ప్రతిపక్షం వారు పోషించాల్సిన పాత్రను మరిచిపోయారు. రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు విఫరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఇది మీకు మంచిది కాదు. రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబుకు ఇది ఒక గుణపాఠం కావాలి. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట. కోర్టులను, ఎన్నికల కమిషన్‌ను మేనేజ్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు ఇది తగదు. ప్రజలంతా ఎన్నికలకు మానసికంగా దగ్గరయ్యారు. రాష్ట్రంలో  ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. నీ హయాంలో ఏకగ్రీవం అయినప్పుడు నీవు ప్రోత్సహించలేదా? ఈ రోజు ఏకగ్రీవం అయితే నీకు వచ్చిన కష్టమేంటి? ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య వచ్చిందా? 

Back to Top