వైయస్‌ జగన్‌ లాంటి సీఎం మాకు లేరని పక్కరాష్ట్రాలు అంటున్నాయి

చంద్రబాబు చిన్న మెదడు చితికినట్లుగా ఉంది

ఓడిపోయేచోట వర్ల రామయ్యను నిలబెట్టి బలి పశువును చేశారు

ఎమ్మెల్యే ఆర్కే రోజా 

 

అమరావతి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏడాది పాలనలోనే 90 శాతం హామీలు అమలు చేసి దేశంలోనే బెస్ట్‌ సీఎంల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. పక్కరాష్ట్రాలకు వెళ్తే వైయస్‌ జగన్‌ లాంటి  ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి లేకపోవడం దురదృష్టకరమంటున్నారని ఆమె తెలిపారు. రాజ్యసభ ఎన్నికలో ఓటు వేసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.  రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ హంగ్‌గా ఏర్పడిందని విమర్శించారు. ఈ పరిణామాన్ని చూస్తే చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందనడానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికినా కూడా చంద్రబాబుకు బుద్ధి రాలేదని, ఇవాళ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కూడా ఏ దురుద్ధేశ్యంతో చంద్రబాబు తన అభ్యర్థిని బరిలో దించారని ఆమె ప్రశ్నించారు. టీడీపీకి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రం రాజ్యసభ సీటు వేరేవాళ్లకు ఇస్తారు. ఈ రోజు మెజారిటీ లేదని చంద్రబాబుకు తెలిసి కూడా కులం చూసి దళితులకు సీటు ఇచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. మా నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అన్నారు. ఈ రోజు తన కేబినెట్‌లో ఐదుగురు దళితులకు స్థానం కల్పించారని, హోం శాఖను మహిళకు ఇస్తే..డిప్యూటీ సీఎం పోస్టును దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో ఏవిధంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చినట్లే ఇచ్చి..ఆ తరువాత తన సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఆయనకు క్యాష్‌ ఉంటే చాలని, క్యాస్ట్‌ను పక్కనపెడతారన్నారు. వర్ల రామయ్య పార్టీని నమ్ముకున్నారు. ఆయన్ను చంద్రబాబు బలిపశువును చేశారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ..దేశంలోనే ఏ సీఎం చేయని విధంగా ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేసి ఉత్తమ సీఎంగా నిలిచారన్నారు. దేశంలోనే బెస్ట్‌ సీఎంలుగా వైయస్‌ జగన్‌ నాలుగో స్థానం దక్కించుకున్నారని చెప్పారు.  ప్రతి రాష్ట్రంలో కూడా మీలాంటి సీఎం మాకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 
 

Back to Top