విజయవాడ: దశలవారి మద్య నిషేధం దిశగా సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్య నిషేధంలో భాగంగానే ధరలు పెంచారన్నారు. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలకు బాధెందుకు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతాడన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తే.. సీఎం వైయస్ జగన్ దశలవారి మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ సర్కార్ రాష్ట్రంలో 44 వేల బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం మోపిందన్నారు. అదే విధంగా 20 శాతం వైన్‌షాపులు, 40 శాతం బార్లు తొలగించారన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ చిత్తశుద్ధితో ముందుకెళ్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.