ఉద్యమం పేరుతో బాబు రౌడీయిజం

బాబు ప్రతిపక్ష నేతా..? పనికిమాలిన నాయకుడా..?

చంద్రబాబు రాయలసీమ ద్రోహి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

వెలగపూడి: ఉద్యమం పేరుతో చంద్రబాబు రౌడీయిజం చేయాలనుకుంటున్నాడని, బాబు రియలెస్టేట్‌ డ్రామాను రాష్ట్రమంతా అసహ్యించుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని, బాబు రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు. చంద్రబాబు విజన్‌ 2020 అంటే ఎంటో ఇప్పుడు తేటతెల్లమైందని, 20 మంది ఎమ్మెల్యేలు, 20 గ్రామాలు.. ఇది బాబు విజన్‌ 2020 అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘చట్టసభలను అడ్డుకోవడం, అలజడులు సృష్టించడమే చంద్రబాబు విజనా..? అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భూములు దోచుకున్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు ప్రతిపక్ష నేతా.. లేక పనికిమాలిన నాయకుడా..? అనే అనుమానం కలుగుతుంది. రైతుల ముసుగులో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారు.

రియలెస్టేట్‌ డ్రామాను రాష్ట్రమంతా అసహ్యంచుకుంటుంది. బాబు 20 గ్రామాలకు ప్రతిపక్ష నేతా.. లేకపోతే 13 వేల గ్రామాలకు ప్రతిపక్షనేతా అనే అనుమానం కలుగుతుంది. 20 గ్రామాల్లో ఏదో జరుగుతుందన్నట్లుగా.. కూకట్‌పల్లి మహిళలను తీసుకొచ్చి రౌడీలను, గూండాలను తీసుకొచ్చి మొన్న ఎమ్మెల్యే పిన్నెళ్లి కారుపై దాడి చేయించాడు. ఉద్యమం పేరుతో రౌడీయిజం చేయాలనుకుంటున్నాడు. అసెంబ్లీని కూడా ముట్టడించాలనే కార్యక్రమం చేస్తున్నాడంటే.. బాబును ఏమనాలి..?

ఒక తల్లి తన ముగ్గురు పిల్లలను సమానంగా చూస్తుంది. అదే విధంగా సీఎం వైయస్‌ జగన్‌ 13 జిల్లాలకు ముఖ్యమంత్రిగా మూడు ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి, నీరు, ఉద్యోగ అవకాశాలను సమానంగా ఇవ్వాలని సమన్యాయంతో ముందుకు వెళ్తుంటే  సామాజిక వర్గానికి న్యాయం కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాలు అందరూ అసహ్యించుకుంటున్నారు. హైదరాబాద్‌ రాజధానిగా పదేళ్లు అవకాశం ఉంటే ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కుపోయి దొంగలా పారిపోయి వచ్చాడు. శాశ్వత భవనాలు కట్టకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా రాష్ట్రాన్ని అనాథ చేసింది చంద్రబాబు కాదా..? లక్షా పది వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి అవసరమని గతంలో చెప్పాడు. రాష్ట్రం విడిపోయేటప్పుడు రూ.5 లక్షల కోట్లు ఉంటే రాజధాని బ్రహ్మాండంగా నిర్మిస్తానని చంద్రబాబు అన్నాడు. కానీ ఈ రోజు రూ. 2 వేల కోట్లు చాలు అంటున్నాడు. అంటే ఆ డబ్బంతా మింగేదామనా..?

లోకేష్‌కు పప్పు అని ఊరికే పేరు పెట్టలేదు. జీఎన్‌రావు కమిటీ ఎవరూ..? బోస్టన్‌ గ్రూపు నివేదిక ఏంటీ..? అని పప్పు మాట్లాడుతున్నాడు. మాజీ మంత్రి నారాయణకు రాజధాని కట్టిన అనుభవం ఉందా..? కనీసం తన కాలేజీల్లో టాయిలెట్లు కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి నారాయణది. కనీసం అసెంబ్లీలో మరుగుదొడ్లు కూడా సరిపడా లేవు. పనికిమాలిన వారిని కమిటీల్లో వేసేది చంద్రబాబు. ఎక్స్‌పర్ట్స్‌తో శివరామకృష్ణన్‌ కమిటీ ఏ విధంగా రిపోర్టు ఇచ్చిందో.. అలాగే బోస్టన్‌ గ్రూపు, జీఎన్‌రావు కమిటీ చాలా చక్కగా ప్రజా అభిప్రాయల మేరకు నివేదిక ఇచ్చింది. అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం అసెంబ్లీలో కల్పిస్తుంటే.. మండలిలో వ్యతిరేకిస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇది వీరి అహంకారానికి పరాకాష్ట కాదా..? తడిగుడ్డలో చెప్పుపెట్టి కొట్టినట్లుగా లోకేష్‌ను ఓడించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు.

 

Back to Top