చంద్రబాబుది విజన్‌ 420

అందుకే ప్రజలు ఓడించి మూలన కూర్చోబెట్టారు

పులిహోర తింటే పులులు అయిపోరు చంద్రబాబూ

చంద్రబాబు తాగుబోతు సంఘాలకు అధ్యక్షుడా..?

నారా వారి సారా పాలన నుంచి విముక్తి కల్పించిన జగనన్నకు రుణపడి ఉంటాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే కచ్చితంగా గాంధీజీ కన్న కలలు నిజం అవుతాయని అనిపిస్తుంది. ఈ దేశంలోని ప్రతీ నాయకుడు, ప్రతీ పార్టీ, ప్రతి ప్రభుత్వం గాంధీజీని గౌరవిస్తాయి. జయంతి, వర్ధంతికి నివాళులర్పిస్తారు.. కానీ ఆ తరువాత ఆయన ఆశయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మొట్టమొదటిసారి దేశంలోనే మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం తొలిరోజు నుంచి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని గర్వంగా చెబుతున్నాను. మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం రావాలన్నారు.. సీఎం వైయస్‌ జగన్‌ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజలందరికీ ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వారి కష్టాన్ని వారి గ్రామంలో పరిష్కరించే విధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులను నియమించడంతో పాటు 14900 మంది ఉమెన్‌ పోలీసులను కూడా నియమించి ఆడవారి రక్షణ కోసం, మద్యపానాన్ని ఎక్కడికక్కడ అరికట్టడం కోసం ఏ విధంగా అడుగులు వేశారో గమనించాలి.

అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరినరోజే స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. ఈ రోజు దిశ చట్టంతో ఆడవారికి ఆ స్వేచ్ఛ లభించబోతుంది. గ్రామాల్లో మద్యపానం ఉండకూడదని ఆకాంక్షించారు. అందుకోసం ఆరు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకునడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో బ్రాందీ పాలనను సమాధి చేసి గాంధీ పాలన తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని గర్వంగా చెప్పగలను.

మద్యపాన నిషేధం అనేది ఒక పవిత్ర యజ్ఞంలాంటిది. ఈ దేశంలో ఎంతోమంది నాయకులు, ఎన్నో పార్టీ మద్యనిషేధానికి హామీలు ఇచ్చారు. కానీ ఓట్ల కోసం కొంత మంది.. నోట్ల కోసం కొంతమంది ఆ మద్యపాన నిషేధాన్ని కాగితానికే పరిమితం చేశారు. మాట తప్పని, మడమ తిప్పని వైయస్‌ రాజశేఖరరెడ్డి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ సీఎం వైయస్‌ జగన్‌ ఆరు నెలల్లోనే 43 వేల బెల్టుషాపులు రద్దు చేశారు. 20 శాతం వైన్‌షాపులను తగ్గించారు. ఇప్పుడు 40 శాతం బార్లను కూడా తగ్గించారు. రాత్రి 8  గంటల వరకే మద్యం అమ్మకాల టైమ్‌ను తగ్గించారు. అలాగే 4 వేలకుపైగా పర్మిట్‌ రూమ్‌లను తగ్గించారు. మహిళలకు ఇచ్చిన మాట కోసం ఇంత కమిట్‌మెంట్‌తో పనిచేసిన ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడైనా చూశారా..?
సభలో ఉన్న సభ్యులంతా చరిత్రను విన్నాం.. చరిత్రను చదివాం. కానీ మొదటిసారి వైయస్‌ జగన్‌ పరిపాలనలో చరిత్రను రాయడం కళ్లారా చూస్తున్నాం. వైయస్‌ఆర్‌సీపీలో ఒక మహిళా ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతున్నాను. మద్యపాన నిషేధం కోసం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతీ మహిళా అభినందిస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు కృషిచేస్తున్నారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, రైతుల కోసం రైతుభరోసా, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని చేస్తున్నా.. ఆ ఇంటి యజమాని మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం కష్టాల నుంచి ఎప్పటికీ బయటపడదని, ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉండదని దశలవారీగా మద్యపాన నిషేధం అనే గొప్ప నిర్ణయానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఆదాయం కోల్పోతామని కొందరు, అమలు చేయలేమని కొందరు.. పథకాలకు డబ్బులు ఉండవని కొందరు.. మగవాళ్లు ఓట్లు వేయరని రకరకాలుగా మద్యనిషేధంపై మాట్లాడారు.. కానీ, ఆదాయం కాదు నాకు ముఖ్యం.. ఆడవారి సౌభాగ్యమే ముఖ్యంగా సీఎం వైయస్‌ జగన్‌ మద్యపాన నిషేధం అమలు చేయడాన్ని అభినందిస్తున్నాం.

గత ఐదేళ్ల నారా వారి సారా పాలన నుంచి.. ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ విముక్తి కలిగించినందుకు సీఎం వైయస్‌ జగన్‌ జన్మ జన్మలు రుణపడి ఉంటాం. మద్యం వల్ల పేదల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కూలీల కుటుంబాలు కుదేలైపోతున్నాయి. రైతులు, శ్రామికుల కష్టం మొత్తం బూడిదలోపోసిన పన్నీరవుతుంది. ఆకలి చావులు, ఆడవారిపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలకు ప్రతీ దానికి కారణం మద్యం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కొన్ని లక్షల మంది మహిళల జీవితాలు అన్యాయం అయిపోయాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు. అందుకే గత ఐదేళ్లలో కృష్ణానదిలో ఏనాడూ వరద నీరు ప్రవహించలేదు. కానీ వాడల్లో, వీధుల్లో మద్యం ఏరులై ప్రవహించింది. వీటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రతిపక్షనేత సభ నుంచి పారిపోయారు. ఎన్టీఆర్‌ తీసుకువచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏరులై పారించి ఆడవారి జీవితాలను నాశనం చేశాడు కాబట్టే ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో చంద్రబాబు సభ నుంచి పారిపోయాడు. సూటిగా ప్రశ్నిస్తున్నా.. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు చంద్రబాబు ఐదు సంతకాలు పెట్టాడు. అందులో బెల్టుషాపుల రద్దు కూడా ఉంది. తొలి సంతకాన్ని కూడా అమలు చేయలేని ఛీటింగ్‌ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. 43 వేల బెల్టుషాపులు పెట్టిన మహానుభావుడు చంద్రబాబు. ఆయన, ఆయన భజన బృందం మాది విజన్‌ 2020 అని ఎప్పుడు చెప్పుకుంటారు. వీళ్లది విజన్‌ 2020 కాదు.. విజన్‌ 420 అని ఈ సందర్భంగా చెబుతున్నాను.

ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం అమ్మకాలను నియంత్రిస్తాం.. బెల్టుషాపులను రద్దు చేస్తామని చెప్పాడు. కానీ చేసింది.. 2020 కల్లా రూ.20 వేల కోట్ల మద్యం అమ్మకాలకు టార్గెట్‌ పెట్టుకున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు తీరు అర్థం చేసుకోవాలి. ఐదేళ్లలో చంద్రబాబు రూ.75 వేల కోట్ల మద్యాన్ని ప్రజల చేత తాగించి పేదల రక్తాన్ని పీల్చిపిప్పిచేశాడు. ఎంతదారుణం అంటే ఆయన కేబినెట్‌లో ఉన్న ఎక్సైజ్‌ మంత్రి బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అనే స్థాయికి దిగజారిపోయారంటే.. వారు మద్యాన్ని ఏ విధంగా ప్రోత్సహించారో ఆలోచించుకోవాలి. ఎన్నో దారుణమైన పరిస్థితులను చక్కదిద్దేందుకు పాదయాత్రలో ఈ కష్టాలు చూసిన సీఎం వైయస్‌ జగన్‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేసితీరాలని అడుగులు వేస్తున్నారు. ఆరు నెలల్లోనే ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అక్టోబర్‌ 1 నుంచి మద్యంపై కొత్త పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. నవంబర్‌లో మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. 2018 నవంబర్‌లో 29.62 లక్షల కేసుల లిక్కర్‌ తాగించారు. కానీ, ఈ ఏడాది నవంబర్‌లో 22.31 లక్షల కేసుల మద్యం మాత్రమే విక్రయించారంటే ఏ విధంగా తగ్గిందో ఆలోచించుకోవాలి. 24.67 శాతం మద్యం అమ్మకాల్లో తగ్గుదల మొదలైంది. బీరు అమ్మకాలు 2018 నవంబర్‌లో 17.80 లక్షల కేసులు అమ్ముడుపోగా.. 2019లో చూస్తే 8.13 లక్షల కేసులు మాత్రమే విక్రయించారు. అంటే దాదాపు 54.30 శాతం బీర్ల అమ్మకాల తగ్గుదల నమోదైంది. అదే విధంగా జనవరి 1 నుంచి 40 శాతం బార్లను మూసేస్తున్నారు. అప్పుడు ఈ మార్పు మరింత స్పష్టంగా తెలుస్తుంది.

షాపులను మాత్రమే తగ్గించడం కాదు.. ఎక్కడైనా అక్రమంగా బెల్టుషాపులు నడిపినా.. ఒకటి కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు కలిగి ఉన్నా.. ఆరు నెలలు జైలు శిక్ష వేసే చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. బెల్టుషాపులు, సాటుసారా తయారీ, అక్రమంగా మద్యం సరఫరాను అరికట్టేందుకు ఏకంగా డీజీ స్థాయి అధికారిని నియమించారు.

ఈ రోజు అసెంబ్లీకి వచ్చే సమయంలో టీవీల్లో చూశాను.. ముఖ్యమంత్రి పరిపాలనను రివర్స్‌లో చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వారి సభ్యులు రివర్స్‌లో నడవడం చూశాను. ఐదేళ్ల పాలనలో 123 మంది ఎమ్మెల్యేలను 23 మందికి రివర్స్‌లో ప్రజలే  పంపించాక ఎందుకు రివర్స్‌లో నడుస్తున్నారో అర్థం కాలేదు. చంద్రబాబు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా.. ఎస్టీలకు బుర్రలేదు అన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీలను ఏకంగా డిప్యూటీ సీఎంలుగా నియమించారు. ఎస్సీ మహిళలకు హోంమంత్రి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రులను చేశారు. అదే విధంగా బీసీలకు తోకలు ఎక్కవ వాటిని కత్తించాలని చంద్రబాబు అన్నాడు.. కానీ బీసీలే చంద్రబాబు, ఆయన పార్టీకి తోకలు కత్తిరించి ఓ మూలన కూర్చోబెట్టారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీ వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వడమే కాకుండా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి ఏ విధంగా అండగా ఉన్నారో గమనిస్తున్నాం. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో అమాంతం అంచనాలు పెంచి దోచుకోవాలని చంద్రబాబు చూస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ఏ విధంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదా చేశారో ఆలోచించాలి. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రివర్స్‌లో వెళ్తున్నారనడంలో ఎలాంటి తప్పులేదు.

చంద్రబాబు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని విజనరీ.. విస్తరాకుల కట్ట అని గొప్పలు చెప్పుకుంటాడు.20 శాతం మద్యం షాపులు, 40 శాతం బార్లను తగ్గించాలని ఏనాడైనా ఆలోచన చేశాడా..? చంద్రబాబు టార్గెట్లు పెట్టి అమ్మిస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ టార్గెట్లు పెట్టి నియంత్రించి మహిళల జీవితాన్ని కాపాడుతున్నారు. చంద్రబాబు చిత్తూరులో ఓ మీటింగ్‌ పెట్టారు. మందుబాబులు ఆయన తమ్ముళ్లు అయినట్లుగా తమ్ముళ్లూ.. మద్యం రేట్లు పెరిగాయని సిగ్గులేకుండా మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ మద్యం రేట్లు పెంచడం వల్ల మందుబాబులు కొత్త బట్టలు కొనుక్కోలేకపోతున్నారంట. చెప్పులు కొత్తవి కొనుక్కోలేకపోతున్నారంట. సబ్బులు కొనుక్కోలేక స్నానాలు కూడా చేయలేకపోతున్నారంట.. ఇంత సిగ్గుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా చూశారా..? మద్యం ధరలు పెరిగాయని ఏడుపు చూస్తుంటే.. తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అనే అనుమానం కూడా కలుగుతుంది. కూరగాయలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని అంటారు.. మద్యం ధరల గురించి ఏడవడం ఏంటో అర్థం కావడం లేదు.

అప్పుడెప్పుడో ఇసుక దొరకడం లేదని ఇసుక దండలు వేసుకున్నారు.. ఉల్లి రేట్లు పెరిగాయని ఉల్లిపాయల దండ వేసుకొని అసెంబ్లీకి వచ్చారు.. మద్యం ధరలు పెరిగాయని మద్యం సీసాలు మెడలో వేసుకొని వస్తారని కొంచెం భయపడ్డాను.. కానీ అలా రానందుకు సంతోషిస్తున్నాను. సూటిగా చంద్రబాబుకు ఒక ప్రశ్న వేస్తున్నాను.. దశలవారి మద్యనిషేధానికి వ్యతిరేకం అని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంతో తీర్మానం చేయించగలడా..? మద్య నిషేధం వద్దు అని టీడీపీ మహిళా ఎమ్మెల్యేతో తీర్మానం చేయించగలడా..?

అప్పట్లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. ఆయన పెట్టిన మద్యనిషేధానికి వెన్నుపోటు పొడిచాడు. మామ కాబట్టి వెన్నుపోటు పొడిచాడు. ఇక్కడున్నది వైయస్‌ జగన్‌.. పులి.. మొన్న టీవీలో చెబుతున్నాడు.. అక్కడున్నది 151 మంది మేకలు.. మేము 23 మంది పులులం అని చంద్రబాబు చెబుతున్నాడు. పులిహోర తింటే పులులు అయిపోరు.. అది పులిహోర బ్యాచ్‌. పులి ఎలా ఉంటుందో సీఎం వైయస్‌ జగన్‌ను చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినా.. తప్పుడు కేసులు పెట్టినా.. పచ్చమీడియాలో ఎంత బురదజల్లినా.. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని తన నిజాయితీతో ప్రజల మనస్సు గెలుచుకొని వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని ఏ విధంగా నెరవేర్చుకుంటూ వెళ్లిపోతున్నారో.. అలాంటి వారిని పులి అంటారు.. పులిహోర బ్యాచ్‌ను పులి అనరని తెలుసుకోవాలి. దిశ చట్టాన్ని భరతమాత గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డ అభినందిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా దిశ చట్టం కాపీని తెప్పించుకొని అమలు చేయడానికి కృషి చేస్తున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top