వైయస్‌ఆర్‌ ప్రతిరూపం వైయస్‌ జగన్‌

ప్రజా సంకల్పయాత్ర ఒక చరిత్ర

దేశంలో ఇంకెవరూ ఇలాంటి సాహసం చేయలేరు

వైయస్‌ జగన్‌ వెంట నడిచేందుకు స్థలం దొరకడం లేదు

రాజన్న పాలన తీసుకురావాలనే తపన జననేతలో కనిపిస్తోంది

ప్రజాదరణ చూసి ఓర్వలేక జననేతను హత్య చేయాలనుకున్నారు

ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

శ్రీకాకుళం: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిరూపం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలంతా మహానేత వైయస్‌ఆర్‌ను వైయస్‌ జగన్‌లో చూసుకుంటున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని విజయ సంకల్ప స్థూపం వద్ద ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ చేసే ప్రతి అడుగు ప్రజలందరికీ భరోసా నింపుతోందన్నారు. జననేత వెంట నడచేందుకు స్థలం కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పాదయాత్రకు ముగింపు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వైయస్‌ జగన్‌ ఒక్కరికే సాధ్యమైందని, దేశంలో ఇంకెవరూ ఇలాంటి సాహసం చేయలేరన్నారు. 

ప్రజలను ప్రేమించే తత్వం వైయస్‌ఆర్‌ కుటుంబానికి మాత్రమే ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఉన్న చరిత్రను వారే బ్రేక్‌ చేస్తున్నారన్నారు. ప్రజల కోసం వైయస్‌ జగన్‌ ఎంత తపన పడుతున్నారో పాదయాత్రలో కలిసిన ప్రజలతో మాట్లాడిన విధానమే నిదర్శనమన్నారు. ఎండ, వాన లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చేయి పట్టుకొని కలిసి నడవడం, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, రైతులు, కార్మికులు, వికలాంగులు అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాజన్న పాలన తీసుకొచ్చి అందరి కష్టాలను దూరం చేయాలనే తపన వైయస్‌ జగన్‌లో కనిపిస్తుందన్నారు. 

వైయస్‌ జగన్‌ ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి చంద్రబాబుకు బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అనుభవం పేరుతో 2014లో అధికారంలోకి వచ్చి చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడో ప్రజలంతా గమనించారన్నారు. ప్రజా వ్యతిరేక పాలనకు సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నవరత్నాలు మాత్రమే కాకుండా పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను మేనిఫెస్టోలో చేర్చి అందరినీ ప్రజలందరికీ మేలు చేస్తామన్నారు. విజయ సంకల్ప స్థూపం పునాది రాజన్న రాజ్యం వస్తుందని చెబుతుందన్నారు. ముసుగు వేసుకొని కొందరు, ముసుగు లేకుండా ఇంకొందరు, మీడియా ఛానళ్లతో మరికొందరు వైయస్‌ జగన్‌ పాదయాత్రను విఫలం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు కుట్రలను ఛేదించి వైయస్‌ జగన్‌ దిగ్విజయంగా పాదయాత్ర ముగిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా ప్రభంజనం చూసి ప్రతిపక్షనేతను హత్య చేయడానికి కుట్ర కూడా చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి ఇవ్వడం కుదరదని బెదిరిపోవడం వెనుక బాబు కుట్ర ఉందని అర్థం అవుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా  అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. 

 

Back to Top